కోలీవుడ్ యాపిల్ బుగ్గల చిన్నారి హన్సిక హంగామాతో నిన్న సాయంత్రం భాగ్యనరంలోని ఒక ధియేటర్ అదిరి పోయింది. టాలీవుడ్ లో తాను మొట్టమొదటసారి ఒక పెద్ద హీరోతో నటించిన సినిమా విడుదల అవుతూ ఉండటంతో హన్సిక మంచి జోష్ లో ఉంది. అదీకాక హన్సికకు నిన్న తన కెరియర్ కు సంబంధించి చాల ముఖ్యమైన రోజు ఒక వైపు రవితేజాతో ఆమె నటించిన ‘పవర్’ నిన్న విడుదలైతే అదేరోజు హన్సిక నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమా ‘అరణ్మయి’ నిన్న కోలీవుడ్ లో విడుదలైంది. ఈ సినిమాలో ఆమె మొట్టమొదటిసారిగా ఎటువంటి గ్లామర్ లేని ఒక డి గ్లామర్ రోల్ చేసింది. ఈ సినిమాకు విడుదలైన మొదటి రోజునే మంచి టాక్ రావడంతో తాను గ్లామరస్ గా కనిపించిన ‘పవర్’ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారో ప్రత్యక్షంగా చూడటానికి నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని దేవి ధియేటర్ లో డైరెక్టర్ బాబి, కోన నీరజలతో కలిసి సినిమాను చూడటమే కాకుండా సినిమాలో రవితేజా యాక్షన్ సీన్స్ కు మాస్ మహారాజా అభిమానులతో పాటు తాను కూడ ఎంజాయ్ చేస్తూ రచ్చ రచ్చ చేసిందని టాక్.  ఇంతటితో ఆగకుండా ఈ సినిమా దర్శకుడు బాబి, నీరజలతో కలిసి తాను తీయించుకున్న ఒక ఫోటోను తన ఫేస్ బుక్ లో పెట్టి ఈరోజు తన జీవితంలో మరిచిపోలేని రోజు అంటూ కామెంట్స్ రాసుకుంది. అయితే హన్సిక హడావిడి ఎంత వరకు ‘పవర్’ కు రక్షిస్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: