టాలీవుడ్ సినిమా రంగంలో అతి తక్కువ కాలంలో టాప్ నిర్మాతగా ఎదిగి ఒక్క చిరంజీవి మినహా మెగా కుటుంబ టాప్ హీరోలందరితోను సినిమాలు చేసిన రికార్డు బండ్ల గణేష్ సొంతం. ఎంతటి టాప్ హీరో లేదా దర్శకుడిని అయినా తన ఖరీదైన బహుమతులతో పడగోట్టే బండ్ల గణేష్ వ్యక్తిత్వం విభిన్నం. ప్రస్తుతం రామ్ చరణ్ తో ‘గోవిందుడు అందరివాడే’ సినిమాను తీస్తున్న బండ్ల గణేష్ ఈ సినిమా పై పెడుతున్న ఖర్చు టాలీవుడ్ బడా నిర్మాతలను కూడ ఆశ్చర్య పరుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ పూర్తి చేసి దాని క్వాలిటీ బాగుండలేదు అని చిరంజీవి కామెంట్ చేస్తే తిరిగి కోట్ల ఖర్చుతో ప్రకాష్ రాజ్ ను తాతగా పెట్టి రీ షూట్ చేయడమే కాకుండా ఇంకా పూర్తిగా నిర్మాణం పూర్తికాని సినిమాను వాయువేగాలతో దసరా పండుగకు తీసుకు వస్తూ అదే వేగంతో ఎల్లుండి సోమవారం ఈ సినిమా ఆడియో వేడుకకు భారీ ఏర్పాట్లను చేస్తున్న బండ్ల గణేష్ ‘గోవిందుడు’ సినిమా పై ఏర్పరుచుకున్న మితిమీరిన నమ్మకానికి టాలీవుడ్ విశ్లేషకులు షేక్ అవుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.  ఈ మధ్యనే లండన్ లో ఒక పాట చిత్రీకరణ ముగించుకుని వచ్చిన ఈ సినిమా టీమ్ ‘గోవిందుడు’ సినిమా విడుదలకు వేగం పెంచడమే కాకుండా పరిస్తుతులను బట్టి అవసరం అనుకుంటే ఈ సినిమాలోని ఒక పాటను సినిమా రిలీజ్ తరువాత కలపడానికి ఒక వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమా ఎడిటింగ్ ను ఇంచుమించు కృష్ణవంశీ తన లండన్ ప్రయాణానికి ముందే పూర్తి చేసాడు అనే వార్తలు కూడ వినిపిస్తున్నాయి. యువన్ శంకర్ రాజా అందిస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ఆయువు పట్టుగా మారనుంది అనే వార్తలు కూడ వస్తున్నాయి. ఒకవైపు గోవిందుడు ను రిలీజ్ కు రెడీ పెడుతూ మరో వైపు రాబోతున్న సంక్రాంతికి జూనియర్ సినిమాను సిద్ధం చేయడానికి బండ్ల గణేష్ ఖర్చు పెడుతున్న డబ్బు పెద్ద పెద్ద నిర్మాతలకు కూడ చుక్కలు చూపెడుతోంది అనే వార్తలతో ఫిలింనగర్ కు హాట్ టాపిక్ గా మారిపోయాడు బండ్ల గణేష్.  

మరింత సమాచారం తెలుసుకోండి: