వెండితెర మన్మధుడు నాగార్జున ఇచ్చిన అవయవదాన పిలుపుకు నిన్న ఒక్క భాగ్యనరంలోనే 4311 మంది ప్రజలు ముందుకు రావడం విశేషం. సినిమతెర పై స్టెప్పులు వేసే తమ అభిమాన హీరోలు ఏదైనా ఒక మంచి విషయం పై ప్రచారం సాగిస్తే ప్రజల స్పందన ఎంత గొప్పగా ఉంటుంది అన్నది మరోసారి నిన్న నాగ్ ఇచ్చిన పిలుపు ద్వారా మరో సారి రుజువు అయింది. యశోదా హాస్పటల్స్, జీవన్‌దాస్ అనే స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవయవదాన అవగాహన కార్యక్రమానికి ఊహించిన దానికన్నా మంచి స్పందన వచ్చింది. హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొనడమే కాకుండా అవయవదానం వల్ల ఎంతో మందికి పునర్జన్మ యిచ్చిన వారమవుతామని అంటూ ఇక తాను నటించే ప్రతి సినిమాలోను ఈ అవయవ దాన అవగాహనకు సంబంధించిన ఒక సీన్ పెట్టి ప్రజలలో ఈ అవయదాన కార్యక్రమానికి మరింత అవగాహన వచ్చేలా ప్రయత్నిస్తానని నిన్నటి సభా వేదిక సాక్షిగా నాగ్ ప్రకటించాడు.  అంతేకాదు ఇప్పటికే ఈ అవయవదాన కార్యక్రమానికి తన అవయవాలను దానం ఇచ్చిన నాగార్జున ఈ సంస్థ నిర్వాహకుల నుండి ఆర్గాన్ డోనర్ కార్డును అందుకున్నాడు. తన అభిమాన సంఘాల కార్యక్రమాలలో తన కటౌట్లకు పువ్వులు, పాలు అభిషేకాలు చేసే తన అభిమానులకు ఒక మంచి కార్యక్రమం పట్ల అవగాహన కల్పిస్తున్న నాగార్జున ప్రయత్నం అందరూ అభినందించ తగ్గ విషయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: