గత కొన్ని రోజులుగా టాలీవుడ్ మీడియాలో తెలుగు హీరోయిన్ స్వాతికి సంబంధించిన పెళ్ళి మేటర్ హాట్ టాపిక్ గా మారింది. తను ఓ తమిళ హీరోను పెళ్ళి చేసుకోబోతున్నట్టుగా అటు మీడియాలోనూ, ఇటు వెబ్ సైట్స్ లో నూ హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ వార్తలపై కలర్ స్వాతి స్పంధించింది. అంతే కాకుండా తన మ్యారేజ్ కి సంబంధించిన విషయాలను కూడ ప్రస్థావించింది. మేటర్ లోకి వెళితే తను పెళ్లి చేసుకుంటున్నట్టు వచ్చిన వార్తలను ఖండించింది కలర్స్ స్వాతి. ఒక ప్రముఖ తెలుగు టీవీ ఛానల్లో స్వాతి పెళ్లి చేసుకుంటున్నట్టు ఒక కథనాన్ని ప్రసారం చేశారు. ఒక తమిళ హీరోతో గత కొంత కాలంగా స్వాతి ప్రేమలో ఉందని, వీరి పెళ్ళికి ఇద్దరి పేరెంట్స్ అంగీకరించారని ఆ కథనం సారాంశం. ఈ వార్తను సోషల్ మీడియాలో ఖండించింది స్వాతి. అయితే స్వాతిపై ఈ తరహా వార్తలు రావడం ఇదే మొదటి సారికాదు. గతంలోనూ కలర్ స్వాతి కి సంబంధించిన కొన్ని పెళ్ళి మేటర్స్, అలాగే ప్రేమ వ్యవహారంకి సంబంధించిన కొన్ని ఎఫైర్స్ వంటి విషయాలు హాట్ టాపిక్ గా నిలిచాయి. ఆ సమయంలో కలర్ స్వాతి అవన్నీ రూమర్స్ అంటూ ఖండించింది. అయితే ఎన్నిసార్లు కలర్ స్వాతి ఎన్నివిధాలుగా చెప్పినా, మీడియా మాత్రం కలర్ స్వాతి వెనక ఉన్న ప్రేమ వ్యవహారాన్ని ఆధారాలతో చెప్పలేకపోతుంది. ఇంతకీ తను తన మ్యారేజ్ కి సంబంధించిన విషయాలపై ఏ విధంగా స్పంధించిందంటే ‘నా పెళ్లి గురించి మరోసారి గాలి వార్తలను ప్రసారం చేస్తున్నారు. వీటిని నమ్మవద్దు. నా ఫ్రిడ్జ్, అందులో ఉన్న ఫుడ్ తో మాత్రమే నేను ప్రేమలో పడ్డాను. అంతే తప్ప నాపై వస్తున్న పెళ్ళి వార్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ నమ్మవద్దు ’ అంటూ సోషల్ మీడియాలో పేర్కొంది. ప్రస్తుతం కలర్ స్వాతి కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పలు మూవీలతో బిజిగా షెడ్యూల్ ని గడుపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: