అక్కినేని నాగార్జున ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. అయితే నాగార్జున నటించిన చిత్రాలు గత కొంత కాలంగా బాక్సపీస్ వద్ద కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొవలసిన పరిస్థితులు వచ్చాయి. ఈ స్టార్ హీరోని డీల్ చేసే సరైన డైరెక్టర్ దొరకపోవడంతో, నాగార్జున ఫిల్మ్ కెరీర్ కూడ కొద్దిగా డైలమోలో పడింది. అంతే కాకుండా నాగార్జున నటిస్తున్న చిత్రాలు సైతం రోటీన్ గా ఉండటంతో సినీ ప్రేక్షకులు నాగార్జు మూవీలని అంతగా పట్టించుకోవడం మానేశారు. ఇదిలా ఉంటే నాగార్జున నటించిన గత చిత్రం మనం మూవీ బాక్సాపీస్ వద్ద గ్రాండ్ సక్సెస్ ని అందుకొంది. అలాగే తను బుల్లితెరలో చేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు? అనే రియాలిటి షో కూడ ప్రజల ఆధరణ పొందింది. దీంతో నాగార్జున ఇప్పుడు మళ్ళీ అందరి నోళ్ళళ్లో హాట్ టాపిక్. ఎందుకంటే నాగార్జున తీయబోతున్న అప్ కమింగ్ మూవీలకి క్రేజ్ పెరిగింది. అలాగే తను బుల్లితెరలో టీ.వి ప్రేక్షకులను అలరిస్తున్న తీరు అందరికి నచ్చింది. ఇదిలా ఉంటే త్వరలోనే అక్కినేని నాగేశ్వర రావుగారి జన్మదినం దగ్గర పడుతుండడంతో అందుకు నాగార్జున ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాడు. సెప్టెంబర్ 20న నాగేశ్వరరావు గారి పుట్టినరోజే కాకుండా, మరి విషయాలను నాగార్జున స్పెషల్ గా తీసుకున్నాడు. దాదాపు మూడు విషయాలను ఆ రోజు అఫిషియల్ గా చెప్పేందుకు నాగార్జున ప్రిపేర్ అవుతున్నట్టుగా టాలీవుడ్ లో కథనాలు వినిపిస్తున్నాయి. సెప్టెంబరు 20న నాగచైతన్య నటిస్తున్న ‘ఒకలైలాకోసం’ సినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే అదే రోజున నాగ్ ఈ సినిమా విడుదల తేదినికూడా ప్రకటించనున్నారు. అదే విధంగా ఆ రోజే మనం సినిమా 100 రోజుల వేడుకను సైతం ఘనంగా నిర్వహించనున్నారు. ఇంకొకటి అఖిల్ మొదటి సినిమా విశేవషాలను అఫిషియల్ గా అనౌన్స్ చేయబోతున్నాడు. అలాగే ఆ మూవీ డైరెక్టర్ ఎవరు? అన్నదానిపై కూడ నాగార్జున అఫిషియల్ స్టేట్ మెంట్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా నాగార్జున చెప్పబోతున్న ఆ అఫిషియల్ న్యూస్ కోసం అభిమానులు ఇప్పటి నుండే ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: