సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ సమంత మరో సారి సంచలనంగా మారుతుంది. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు సమంతని వారి మూవీల్లో హీరోయిన్ గా తీసుకోవాలని తెగ తొందర పడుతున్నారు. బడా నిర్మాతలు అయితే వారికి మూవీలు ఉన్నా, లేకున్నా సమంత కాల్షీట్స్ ని మాత్రం ముందుగానే ప్రి బుక్డ్ చేసుకుంటున్నారు. అయితే నిర్మాతల మూవీలు క్యాన్సిల్ అయితే, ఆ కాల్షీట్స్ ని సెకెండ్ మార్కెట్ లో వేరే నిర్మాతలకి షిప్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత కాల్షీట్స్ ని ముందుగానే బుక్ చేసుకోవాలంటే దాదాపు సగం రెమ్యునరేషన్ ని ముందుగానే ఇవ్వాలన్న మాట. ఒక్కోసారి సగానికి పైగానే రెమ్యునరేషన్ ని ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రీసెంట్ గా ఓ బడా నిర్మాత సమంతని తను నిర్మిస్తున్న మూవీలోకి హీరోయిన్ గా తీసుకున్నాడు. అయితే సమంత రెమ్యునరేషన్ కోటిరూపాయల ముఫై లక్షల రూపాయలు కాగా, అందులో సగానిపైగా రెమ్యునరేషన్ ని ముందుగానే చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరైతే ఎక్కువ మనీను ప్రీ అడ్వాన్డ్స్ గా చెల్లిస్తారో, వారి మూవీలకి సమంత వెంటనే ఒప్పుకుంటుంది. ఆ విధంగా ఆ నిర్మాత వద్ద నుండి సమంత ఓ ఎనభై లక్షల వరకూ అడ్వాన్డ్స్ మనీగా తీసుకుంది. దీంతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ విషయంలోనే నెంబర్ వన్ గా ఉన్న సమంత, ఇప్పుడు అడ్వాన్డ్స్ పేమెంట్స్ ని తీసుకోవడంలోనూ ముందు వరుసలోనే ఉందంని అంటున్నారు. ఇదిలా ఉంటే సమంత త్వరలోనే బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తను చేయబోతున్న మూవీకి సంబంధించిన విషయాలను వెల్లడించబోతుందంటూ టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. సమంత ప్రస్తుతం తెలుగులో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సంవత్సరం తను తమిళ మూవీలను ఎక్కువ చేయటానికి తన డేట్స్ ని అడ్జెస్ట్ చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: