మంచు మనోజ్ పై తండ్రి మోహన్ బాబు ఘూటైన వాఖ్యలు చేశాడు. అయితే ఈ తరహా స్టేట్ మెంట్ ఇవ్వటానికి ఓ కారణం ఉంది. తాజాగా జరిగిన కరెంట్ తీగ ఆడియో ఫంక్షన్ లో మంచు మనోజ్ గురించి అందరూ తెగ పొగడ్తలు కురిపిస్తుంటే, ఇద్దరు వ్యక్తులు మాత్రం మంచు మనోజ్ ఎదుగుతున్న తీరును పొగుడుతూనే, తను చేస్తున్న చేష్టలు తప్పు అని నిక్కచ్ఛిగా చెప్పారు. వారిలో మొదటి వారు మోహన్ బాబు కాగా, మరొకరు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. నిజానికి వీరిద్దరి చెప్పిన దాంట్లో ప్రతిదీ నిజమే ఉంది. తండ్రిగా కొడుకు ఎదుగుదలకి మోహన్ బాబు ఓ వైపు సంతోష పడుతుంటే, మరోవైపు మంచు మనోజ్ మూవీల్లో చేస్తున్న డేంజరస్ స్టంట్స్ గురించి తెలుసుకుంటుంటే తండ్రి స్థానంలో ఉన్న మోహన్ బాబుకి ఇది ఏ మాత్రం సంతోషపడే విషయం కాదు. ఓ హీరోగా మంచు మనోజ్ తన మూవీకి చాలా శ్రమిస్తాడు. కాని తన మూవీలో చేసే యాక్షన్ స్టంట్స్ ని తనే కంపోజ్ చేసుకొని, డూప్ లేకుండా రిస్క్ చేస్తాడు. అటువంటి సందర్భాల్లో అని సమయాలు ఒకేలా ఉండవు. ఏదైనా తప్పు జరిగితే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఇది ఒక్క ప్యామిలీతో సరిపడదు. యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన 24 క్రాప్ట్స్ మాత్రమే కాకుండా తన చుట్టు ఉండే వారి మీద కూడ ఆ ప్రభావం ఉంటుంది. అందుకే హీరోలు ఎట్టిపరిస్థితుల్లోనూ డూప్ లేకుండా సాహసాలు చేయకూడదని మోహన్ బాబు, మంచు మనోజ్ కి హితవు ఇచ్చాడు. అంతే స్థాయిలో దాసరి నారాయణరావు కూడ మంచు మనోజ్ చేస్తున్న స్టంట్స్ మంచివి కాదని హెచ్ఛరించాడు. నిజానికి మంచు మనోజ్ చేస్తున్న రియల్ స్టంట్స్ వల్ల మూవీకి హైప్ క్రియోట్ అవ్వదు. నటుడు చూపించే ప్రతిభతోనూ, అలాగే మంచి కథతో మాత్రమే అది సాధ్యపడుతుంది. అత్యాధునిక టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో కూడ ఇటువంటి పాత ఫార్ములా అయిన డూప్ లెస్ ఫైటింగ్ చేయాల్సిన అవసరం హీరోలకు ఎంత మాత్రం అవసరం లేదు. 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మంచు మనోజ్ ఫిల్మ్ కెరీర్ లో, ఇక నుండైన తన అప్ కమింగ్ మూవీస్ లో ఇలాంటి రియల్ స్టంట్స్ ని తగ్గించుకుంటాడని టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆశిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: