సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా కెరీర్ ని లీడ్ చేస్తున్న హీరోయిన్ సమంత. ఇదిలా ఉంటే సమంత గత కొంత కాలంగా తన మూవీలకు రెమ్యునరేషన్ ని పెంచుకుంటుంది. ఒక్కో మూవీకి దాదాపు కోటిన్నర రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటూ నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుంది. మూవీ హిట్ అయితే సమంత పేరు కూడ సక్సెస్ లో కీలకంగా కనిపిస్తుంది. మూవీ ప్లాప్ అయితే ఆ మూవీ బడ్జెట్ లో అనవసర బడ్జెట్ అంటూ ఏదైనా ఉంటే, ఆ వరుసలోనూ సమంత పేరే మొదటి సారిగా వినిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం మాత్రం సమంత ట్రెండ్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో ఉంది. సమంతను వారి మూవీలలోకి హీరోయిన్ గా తీసుకోవడం కోసం స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం సినిజీవితంలో మరో స్టెప్ ముందుకు వేయబోతుంది. తను ఓ చిన్న సినిమాకి నిర్మాతకి మారే అవకాశం కనిపిస్తుందని అంటున్నారు. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ యంగ్ డైరెక్టర్ కి సమంతకి కథ చెప్పి, నిర్మాతగా వ్యవహరిస్తే లాభాలు కురిపిస్తానని చెప్పాడంట. అయితే ఆ డైరెక్టర్ చెప్పిన కథ చాలా బాగుండటంతోఆ మూవీకి నిర్మాతగా ఉండటానికి సమంత ఒప్పుకుంది. దాదాపు మూడు కోట్ల రూపాయల బడ్జెట్ తో ఆ మూవీ స్టార్ కాబోతుంది. చెన్నై నేటివిటీ కి సరిపోయే కథాంశం కావడంతో సమంత ఆ మూవీనికి నిర్మాతగా ఉంటున్నట్టు కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్స్ వినిపిస్తుంది. సమంత నిర్మాతగా ఉంటున్న ఆ మూవీ లో నటించే నటులు అంతా కొత్తవారే. మొత్తానికి సమంత నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టి, తన మార్కెట్ ని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సుస్థిరం చేసుకోవటానికి బలంగా ప్రయత్నిస్తుంది. ఈ మూవీ కోలీవుడ్ లో సక్సెస్ సాధిస్తే, తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేసేందకు సమంత ఆసక్తిగా ఉందట. ఈ మూవీకి సంబంధించిన వివరాలు త్వరలోనే అఫిషియల్ గా బయటకు రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: