ఈగ తరువాత నానీకి ఎదురులేదు అని అనుకొన్నారు అంతా. కాని దురదృష్టం వెంటాడటంతో రెండు సంవత్సరాలు గడిచినా నానీ నటించిన ఏ ఒక్క సినిమా హిట్ కాకపోవడం నాని మార్కెట్ ను తగ్గించి వేసింది. కాని ప్రేక్షకులలో మాత్రం నాని క్రేజ్ అలాగే కొనసాగుతోంది. ‘పైసా’, ‘ఆహాకళ్యాణం’ సినిమాల పై నాని పెట్టుకున్న అంచనాలు తప్పడంతో నాని తన స్పీడ్ కు బ్రేక్ వేసి భవిష్యత్తులో చేయబోయే సినిమాల విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడని ఫిలింనగర్ టాక్. అయితే నాని ఈ మధ్య ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భవిష్యత్ లో తను చేయబోయే సినిమాల ఎంపిక గురించి ఒక ఆశక్తికర విషయాన్ని చెప్పి అందరికీ మైండ్ బ్లాంక్ చేసాడు.  గత మూడు నెలలుగా నాని 85 సినిమా కధలు విన్నాడట ఆ 85 కధలలోంచి మూడు సినిమాలను త్వరలో చేయబోతున్నాను అని అంటున్నాడు నాని. గతంలో జరిగిన పొరపాట్లను మళ్ళీ చేయకుండా తన సినిమాల ఎంపిక విషయంలో చాల జాగ్రత్తలను తీసుకుంటున్నాను అని నాని చెప్పే విషయాలు బాగున్నా బూతు సినిమాలను తీసే మారుతి సినిమాలో నాని నటిస్తున్నాడు అని వార్తలు రావడం బట్టి 85 కధలు విన్న నానీకి మారుతి చెప్పే కధ నచ్చిందా అనే ఆశ్చర్యo కలుగుతుంది. ఇదే సందర్భంలో నాని మాట్లాడుతూ తనకు ఒకనాటి సూపర్ హిట్ సినిమాలైన ‘దళపతి’, ‘రోజా’, ‘అంజలి’ లాంటి సినిమాలు చేయాలని ఉంది అని నానీ కోరుతున్న కోరికను తీర్చగలిగిన దర్శకులు ఉన్నారా? అన్నదే ప్రశ్న.   

మరింత సమాచారం తెలుసుకోండి: