నటుడు కమల్‌హాసన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో కమల్ చికిత్స పొందుతున్నారు. సినిమా చిత్రీకరణ సమయంలో కలుషిత ఆహారం వల్ల కమల్ అస్వస్థతకు గురైనట్లు అపోలో వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. రేపు డిశ్చార్జి అయిన తర్వాత యథావిధిగా షూటింగ్‌లో పాల్గొంటారని కమల్ సన్నిహితులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: