టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఎప్పుడు తన ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా ఏదో ఒక విషయాల పై తన అభిప్రాయాలను చెపుతూ ఎప్పుడు సందడి చేస్తూనే ఉంటాడు . అంతే కాదు తనకు నచ్చిన కొన్ని సినిమాలకు తన ట్విటర్ ద్వారా ప్రచారం చేస్తూ వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా కుడా మారుతూ ఉంటాడు. అటువంటి మన జక్కన్న నిన్న ఇటు టాలీవుడ్ లోను అటు కోలీవుడ్ లోను హడావిడి చేసిన రెండు సినిమాల ఆడియో వేడుకలలో విడుదల అయిన టీజర్ ల పై ప్రతి స్పందించాడు. నిన్న జరిగిన ఆడియో వేడుకలలో ‘గోవిందుడు అందరి వాడేలే’, ‘ఐ’ చిత్రాల ట్రైలర్స్ విడుదల కావటంతో వాటిని చూసి తన అభిప్రాయాలను తెలియచేసాడు రాజమౌళి. ముందుగా శంకర్ ‘ఐ’ చిత్రం ట్రైలర్ ని పొగడ్తల్లో ముంచెత్తివేస్తూ “శంకర్ సార్ "ఐ" టీజర్ మైండ్ బ్లోయింగ్ ఎవరూ ఆ గ్రాండియర్ కు, విజువల్స్ కు దగ్గరకు కూడా రాలేరు" అంటూ కామెంట్ చేసాడు రాజమౌళి. ఇక గోవిందుడు గురించి ట్వీట్ చేస్తూ ‘' చూస్తూంటే కృష్ణ వంశీ గారు తిరిగి తన ఎలిమెంట్స్ తో వచ్చినట్లుంది ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది చరణ్ కు పోనీ టెయిల్ బాగా నప్పింది” అని కామెంట్లు విసిరాడు రాజమౌళి.  మరి చరణ్ పోనీ టెయిల్ దసరాకు ఎన్ని కోట్లు కురిపిస్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: