టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెలితిగా ఉందంటూ మెగాస్టార్ 150వ సినిమా గురించి ప్రస్తుతం కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఈ తరహా అనవసరపు మాటలను పక్కన పెడితే, మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న 150వ సినిమాకి సంబంధించిన విషయాలను తెలుసుకోవాలని మాత్రం, సాధరణ సినీ ప్రేక్షకులే కాకుండా సీనీ ఇండస్ట్రీ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన స్టోరిని ఎవరు ఇస్తున్నారు? డైరెక్టర్ ఎవరు చేస్తున్నారు? హీరోయిన్ గా ఎవరు ఉంటున్నారు? వంటి విషయాలపై చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మెగాస్టార్ నటించబోతున్న మూవీకి సంబంధించిన కథ, ప్రస్తుతానికి ఫైనల్ అయింది. అయితే ఆ కథలో మరొకొద్దిగా మార్పులు అవసరం అంటూ చిరంజీవి పర్యవేక్షణ చేస్తున్నాడు. చిరంజీవి 150వ మూవీకి కథని అందించేది పరుచూరి బ్రదర్స్ అనే విషయం టాలీవుడ్ లో ఓపెన్ టాక్ గా వినిపిస్తుంది. అలాగే దర్శకుడి సంబంధించి కొద్ది మంది పేర్లు కూడ బయటకు వినిపిస్తున్నాయి. వారిలో ఫైనల్ ఎవరు అన్నదానిపై ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలి అనే దానిపైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆసక్తికరమైన టాక్స్ వినిపిస్తున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అందిన విశ్వసనీయమైన సమాచారం మేరకు చిరంజీవి సరసన హీరోయిన్ గా అనుష్కని తీసుకుంటున్నట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనుష్కతో మెగా బృందం మాటలు జరిపినట్టుగా సమాచారం తెలుస్తుంది. చిరంజీవి 150వ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ ఉండగా, అందులో ఒక హీరోయిన్ అనుష్కకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఎక్కువుగా కనిపిస్తుంది. దీంతో అనుష్క బంపర్ ఆఫర్ కొట్టేసిందంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: