నందమూరి కుటుంబం నుండి ఎందరో నటవారసులు ఉన్నా నారా కుటుంబం నుండి ఏకైక ప్రతినిధిగా టాలీవుడ్ లో తన సత్తా చాటడానికి నారా రోహిత్ తన ‘బాణం’ సినిమా నుండి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నటుడిగా మంచి పేరు వచ్చినా కమర్షియల్ సక్సస్ విషయంలో ఈనాటి యంగ్ హీరోల రేసులో వెనకపడి ఉన్నాడు. గత రెండు రోజులుగా భారీ ఆడియో ఫంక్షన్స్ తో వేడెక్కిపోతున్న ఆడియో ఫంక్షన్స్ రేసులో తన ‘రౌడీ ఫెలో’ సినిమా ఆడియో ఫంక్షన్ ను నిన్న భాగ్యనగరంలో హంగామాగా నిర్వహించి తాను కూడ యంగ్ హీరోల రేసులో ఉన్నాను అంటూ సవాల్ విసిరాడు నారారోహిత్. ఒక పక్క నిలువెత్తు చంద్రబాబు కటౌట్లు, మరోపక్క బాలయ్య కటౌట్లతో వేదిక ప్రాంగణం నిండిపోయింది. ఆడియో ఫంక్షన్ జరుగుతున్న వేదిక ప్రాంగణంలో కనీసం ఒక మూల కూడ జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్ లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆడియో వేడుకకు వచ్చిన జనం మాత్రం రోహిత్ కు జిందాబాద్ చెప్పకుండా బాలయ్య జిందాబాద్ అంటూ హోరెత్తించారు. దీనితో చంద్రబాబు కూడా తప్పని సరిగా బాలయ్య గురించి తన ప్రసంగంలో ప్రస్తావించాల్సి వచ్చింది. నందమూరి కుటుంబం స్టామినా చూపించిన ఆడియో వేడుకగా ‘రౌడీ ఫెలో’ జరగడంతో చంద్రబాబు కూడ ఎన్టీఆర్ ‘జస్టిస్ చౌదరి’ లాంటి సినిమాలు కావాలి అంటూ పిలుపు ఇవ్వడంతో నారారోహిత్ కన్నా ‘రౌడీ ఫెలో’ ఆడియో వేడుకలో బాలయ్య నామస్మరణే ఎక్కువగా వినిపించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: