హీరోలకు తమ సినిమా విజయాలు తమ పారితోషికాలను చుక్కలు అంటేలా పెంచుకునే అవకాశాలు ఇస్తాయి. కానీ వరస పరాజయాలతో కొద్దిగా నిరాశగా ఉన్న జూనియర్ మనసును పొడుపు చర్యల పై ఆలోచింప చేస్తోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.  పరాజయాల నేపధ్యంలో తాను నటించబోయే సినిమా కదల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా తన సినిమాలకయ్యే అనవసరపు ఖర్చుని తగ్గించుకోవాలని తనతో సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలకు జూనియర్ సుచిస్తున్నాడని టాక్. తాను చెప్పే మాటలు తనతోనే మొదలు అయ్యేడట్లుగా తన పారితోషికాన్ని తగ్గించుకోవడమే కాకుండా అటు హీరోయిన్స్ విషయంలో కూడ భారీ ఖర్చులు, భారీ పారితోషికాలు వద్దు అంటూ నిర్మాతలకు క్లాస్ పీకుతున్నాడట జూనియర్. తన సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తాయి కాబట్టి సినిమాకు ఏవరేజ్ టాక్ వచ్చినా నిర్మాతలు, బయ్యర్లు నష్ట పోకుండా జూనియర్ ఈ మాస్టర్ ప్లాన్ వేసాడు అని అంటున్నారు. అదేవిధంగా తన సినిమా పాటల చిత్రీకరణ విషయంలో కూడ వీలైనంత వరకు ఫారెన్ లోకేషన్స్ తగ్గించమని దర్శకులకు జూనియర్ సూచిస్తున్నాడట. వింటున్న ఈ వార్తలను బట్టి చూస్తూ ఉంటే ‘రభస’ పరాజయం జూనియర్ కు జ్ఞానోదయంగా మారింది అని అనుకోవాలి. ఏది ఎలా ఉన్నా వినిపిస్తున్న వార్తలు జూనియర్ నిర్మాతలకు శుభవార్తే అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: