శిoభూ హన్సికల బ్రేకప్ వ్యవహారం ముగిసిపోయి చలరోజులే అయిపోతున్నా గడిచిన విషయాలను మరిచిపోలేక అనుకోవాలి మాజీ ప్రేమికుడు శింబుకు నటి హన్సిక మరో షాక్ ఇచ్చింది. ప్రస్తుతం వీరిద్దరు నటిస్తున్న ‘వాలు’ సినిమా నిర్మాతకు ఈ మాజీ ప్రేమికుల రగడ తలనొప్పిగా మారి ఆ సినిమా విడుదల పై ప్రభావాన్ని చూపెడుతోంది అనే వార్తలు కోలీవుడ్ మీడియా రాస్తోంది. ఈ సినిమా కోసం హన్సిక 64 రోజుల కాల్‌షీట్స్ నిర్మాత కోరిన విధంగా ఇచ్చిందట. అయితే సినిమా నిర్మాణం పూర్తి కాకపోవడంతో మరో 20 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాననీ అయితే అవి కూడ సక్రమంగా వినియోగించుకోకుండా ఇంకా ఈ సినిమా పూర్తి కాకపోయిన విషయంలో తన పాత్ర ఉంది అంటూ శిoభూప్రచారం చేయడం తనకు చికాకుగా మారింది అని ఇక ఈ సినిమా గురించి ఒక్కరోజు కూడ నటించను అంటూ జరుగుతున్న శిoభూ, హాన్సికల యుద్ధం మీడియాకు హాట్ టాపిక్ అయితే నిర్మాతకు మాత్రం చుక్కలు చూపెడుతోంది అనే వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ‘పవర్’ సినిమాలో తన పాత్రకు విమర్శకుల దగ్గర నుండి కూడ మంచి మార్కులు పడటంతో హన్సిక టాలీవుడ్ లో వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి అని నిర్ణయించుకున్నట్లుగా కోలీవుడ్ మీడియా టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: