యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రాలు బాక్సాపీస్ వద్ద ఆశించనంతగా సక్సెస్ ని సాధించలేకపోవడంతో, తన నటిస్తున్న చిత్రాలపై కొద్దిగా అనుమానాలు పెరుగుతున్నాయి. జూనియర్ గ్రేట్ యాక్టర్ అయినప్పటికీ, తనను డీల్ చేసే డైరెక్టర్ సరిగా చూపించలేకపోతున్నాడని, సరికొత్త జూనియర్ ని చూపించామంటూ డైరెక్టర్ రిలీజ్ కి ముందు ఎన్ని మాటలు చెప్పినా, మూవీలో మాత్రం గతంలో జూనియర్ చేసిన మూవీలనే మళ్ళీ గుర్తుకు తెచ్చేలా చూపిస్తున్నారు. దీంతో బాక్సాపీస్ వద్ద మూవీలో కొత్తదనం లేక జూనియర్ నటిస్తున్న మూవీలు అంతంత మాత్రంగా నిలుసున్నాయి. దీంతో ఈసారి ఇటువంటి విషయాలని జూనియర్ చాలా సీరియస్ తీసుకుంటున్నట్టుగా టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. తన అప్ కమింగ్ మూవీలో ఎటువంటి ఆర్భాటాలకు పోకుండా, కథపై శ్రద్ధ వహించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. స్టార్ డైరెక్టర్ష్ కి తన కాల్షీట్స్ ఇవ్వటానికి చూస్తున్నాడు. కొత్త డైరెక్టర్స్ కంటే కొన్ని మూవీలు స్టార్ డైరెక్టర్స్ డైరెక్షన్ లోనే నటిస్తేనే మంచిదని జూనియర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పూరీజగన్నాధ్ తో నటిస్తున్న మూవీ తరువాత, జూనియర్ సుకుమార్ డైరెక్షన్ లో నటించేందుకు సిద్ధంగా ఉన్నాడు. సుకుమార్ తరువాత వినాయక్ మూవీలో నటించే అవకాశం ఉందంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే వినాయక్ తోనూ, సుకుమార్ తో జూనియర్ మాటలు జరిపాడు. సుకుమార్ మూవీకి సంబంధించిన కథలో ఏ తరహా స్టోరి ఉండాలి అన్నదానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. అలాగే తన అప్ కమింగ్ ఫిల్మ్స్ లో హీరోయిన్స్ ని సైతం కొత్త వారిని తీసుకోవాలని చూస్తున్నాడు. మొత్తంగా జూనియర్ పలురకాల కొత్త నిర్ణయాలతో, తన అప్ కమింగ్ మూవీలను బాక్సాపీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: