టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రయోగాలు చేస్తూ వస్తున్న స్టార్ హీరో, నాగార్జున. ఇప్పటి వరకూ ఏ స్టార్ హీరో కూడ సాహసాలు చేయనంతగా నాగార్జున తన నటనతో చేసి చూపించాడు. అంతే కాకుండా కథల విషయంలోనూ నాగార్జున ఎంచుకునే విధానం చాలా డిఫ్రెంట్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా నాగార్జున మరోసారి ఓ ప్రయోగాత్మక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఓ చిన్న తరహా సినిమాలో తను నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఓ మాటలు లేని సందేశాత్మకత చిత్రంలో నాగార్జున నటిస్తున్నాడంటూ టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. గతంలో కమల్ హాసన్ నటించిన పుష్పక విమానం వంటి సినిమాను, ఈ కాలంలో తీస్తే ఎలా ఉంటుంది? అనే విధంగా ఓ నిర్మాత భావిస్తున్నాడు. అయితే మూవీపై ఎటువంటి ఫ్రాఫిట్స్ ఆలోచించకుండా, ఓ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ గా దానికి తెరకెక్కించాలని ఆ నిర్మాత భావించాడు. దాంతో ఓ స్టార్ డైరెక్టర్ ని కథ రెడీ చేసుకోమని, కథ రెడీ అయిన తరువాత దానిని నాగార్జునకి వినిపించారట. అందుకు నాగార్జున సైతం ఆ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మూవీలో నటించేకుందు ఆసక్తి చూపడంతో ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అన్ని విషయాలను త్వరలోనే అఫిషియల్ గా చిత్ర యూనిట్ అనౌన్స్ చేయనున్నారు. నాగార్జున మాటలు లేకుండా మూవీలో నటిస్తే, ఆ మూవీ ఎలా ఉంటుంది అనేది కూడ చాలా ఆసక్తి కరంగా మారింది. అయితే మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం కాబట్టి, నాగార్జున కచ్ఛితంగా ఆ కథకి న్యాయం చేస్తాడని అంటున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే నాగార్జున నటించోతున్న మరో అప్ కమింగ్ ఫిల్మ్ లో, నాగార్జున డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఆ మూవీకి కొత్త దర్శకుడు పరిచయం అవ్వబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ లో తమన్న హీరోయిన్ గా నటిస్తుందంటూ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: