స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస మూవీలు చేసిన బ్యూటీ ప్రియమణి. ప్రస్తుతం ప్రియమణికి తెలుగులో మార్కెట్ అంతగా లేదు. తను తీసిన హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు అన్ని బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టడంతో తనకి టాలీవుడ్ లో మార్కెట్ పూర్తిగా పోయింది. ప్రియమణికి స్టార్ హీరోల సరసన ఆఫర్స్ వస్తున్నప్పటికీ, తను హీరోయిన్ లీడ్ రోల్స్ పాత్రలవైపు వెళ్ళడం అనేది తను చేసిన తప్పుగా టాలీవుడ్ ఇప్పటికీ చెబుతుంది. ఇదిలా ఉంటే ప్రియమణికి హీరోయిన్ గా పెద్దగా ఆపర్స్ లేకపోవడంతో కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త అవతారం ఎత్తింది. తమిళ్ లో బుల్లితెరకి పరిచయం అవుతూ ఓ షో ని నిర్వహిస్తుంది. అయితే ప్రియమణి తాజాగా ఓ కన్ ఫ్యూజన్ లో పడిందట. తన వద్దకు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ కెమెరా టెక్నిషియన్ వచ్చి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు. ఇది జరిగి దాదాపు రెండు సంవత్సరాల సమయం అవుతుంది. అయితే ప్రియమణి అప్పుడు తను చెప్పిన ప్రపోజల్ ని చూద్దాం అంటూ పెండింగ్ లో పెట్టింది. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పలు మూవీలకు కెమెరామెన్ గా తను పనిచేశాడు.తను చేసినవాటిల్లో పెద్ద మూవీలు సైతం ఉన్నాయి. ప్రస్తుతం ప్రియమణి అవకాశాలు కోల్పోయి, ఎక్కువుగా ఫ్రీ సమయాన్ని గడుతుండటంతో, ఇక తన ఫిల్మ్ కెరీర్ దాదాపు చివరి దశకు చేరుకుందని గ్రహించింది. ఈ సమయంలోనే పెళ్ళి చేసుకుంటే మంచిదని తను కూడ ఆలోచిస్తుందట. అయితే తను తీసుకుంటున్న ఆ నిర్ణయం సరైనదా? కాదా? అనేది తేల్చుకోలేకపోతుంది. ఈ విషయంపై తను పలువురి సలహాలను తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రియమణి ఫ్యామిలీ అయితే, పెళ్ళి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఒకవేళ తను పెళ్ళి చేసకోవలసి వస్తే కచ్ఛితంగా కోలీవుడ్ కి చెందిన ఆ కెమెరామెన్ ని పెళ్ళి చేసువాలని నిర్ణయించుకుందట. మొత్తానికి కన్ ఫ్యూజన్ లో ఉన్న ప్రియమణి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: