టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు అని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అలాగే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా పేరుతెచ్చుకున్న వారిలో ఒకరు బండ్ల గణేష్ అని చెప్పవచ్చు. వీరిద్దరూ కలిస్తే ఆ మూవీ ఎలా ఉంటుంది? ఇప్పటి వరకూ మహేష్ బాబు తో అతి పెద్ద ప్రాజెక్ట్స్ చేసిన నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకుంటారు. కాని బండ్ల గణేష్, ప్రిన్స్ మహేష్ బాబు కలిస్తే ఆ రికార్డ్ ని కచ్ఛితంగా తన ప్రొడక్షన్ వాల్యూస్ బ్రేక్ చేయాలని బండ్ల గణేష్ కోరుకుంటున్నారు. రీసెంట్ గా బండ్ల గణేష్, ప్రిన్స్ మహేష్ బాబుని కలిసి, తన నిర్మాణంలో ఓ మూవీకి అంగీకరించాలని కోరాడంట. అయితే అందుకు మహేష్ బాబు మొదట చూద్ధాంలే... అనే సమాధానం ఇచ్చాడు. అందుకు సంతోషించని బండ్ల గణేష్, మరి కొద్ది రోజుల తరువాత మహేష్ బాబుని మళ్ళీ కలిసి కచ్ఛితంగా ఒప్పుకోవాలి అంటూ కూర్చున్నాడు. అయితే అప్పటికే బండ్ల గణేష్ ట్రాక్ రికార్డ్ ని పరిశీలించిన మహేష్ బాబు, తన నిర్మాణంలో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కావటానికి దాదాపు మూడు సంవత్సరాల సమయం పడుతున్నట్టుగా మహేష్ వివరించాడు. ఇప్పటికే తను ఒప్పుకున్న మూవీలు పూర్తి కావటానికి దాదాపు 3 సంవ్సతరాల సమయం పడుతుందట. అందుకే వీరిద్దరి కాంబినేషన్ ని తెరపైకి రావాలంటే అంత సమయం తీసుకుంటుంది. మహేష్ బాబుతో సినిమాని ఒప్పించటానికి బండ్ల గణేష్ మాట్లాడిన తీరు మహేష్ ని భయపెట్టిందట. ఎందుకంటే ఓ స్టార్ హీరో వద్ద ఏ విధమైన మాటలు చెప్పాలో బండ్ల గణేష్ కిప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అది తనకి వెన్నతో పెట్టిన విధ్య అని అంటారు. అందుకే మహేష్ బాబు కి ఛాన్స్ ఇవ్వకుండా దాదాపు గంట పాటు ఏకధాటిగా మాట్లాడి, ప్రాజక్ట్ ని ఓకె చేయించుకున్నాడంట. బండ్ల గణేష్ మాటలకి ఒక సమయంలో మహేష్ బాబు సైతం భయపడేలా ఉందని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: