ఇండియన్ మైఖైల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్ డ్యాన్సర్ ప్రభుదేవా. డ్యాన్సర్ గా కెరీర్ స్టార్ చేసి, కొరియోగ్రాఫర్ గా , యాక్టర్ గా, డైరెక్టర్ గా ప్రభుదేవా సక్సెస్ ఫుల్ ఫిల్మ్ కెరీర్ ని లీడ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభుదేవా వ్యవహారం బిటౌన్ లో హాట్ టాపిక్ గా మారుతుంది. గతంలో ప్రభుదేవా, నయనతారని పెళ్లి చేసుకోవటానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాడు. చివరకు ఆ వ్యవహారం గొడవలతో రచ్ఛ రచ్ఛగా మారింది. చివరకు ప్రభుదేవా, నయనతార పెళ్లి వ్యవహారం సూపర్ స్టార్ రజనీకాంత్ వరకూ వెళ్ళి, సెటిల్మెంట్ జరగాల్సిన పరిస్థితి వచ్చింది. వీరి పెళ్లికి ఇన్ని ఇబ్బందులు కారణంగా ఉండటంతో వీరే వారి పెళ్లి తంతుని విరమించుకున్నారు. ఇప్పుడు ఎవరి పని వారు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ప్రభుదేవా బిటౌన్ సక్సెస్ ఫుల్ ఫిల్మ్ మేకర్ గా, బాక్సాపీస్ డైరెక్టర్ గా ఉంటున్నాడు. తను తీస్తున్న పలు హింధీ మూవీలు, బిటౌన్ బాక్సాపీస్ వద్ద రికార్డ్స్ ని బ్రేక్ చేశాయి. ప్రస్తుతం ఆయన అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కుతున్న హిందీ మూవీ ‘యాక్షన్ జాక్సన్' చిత్రం షూటింగుతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ ఫిమేల్ కొరియోగ్రాఫర్, ప్రభుదేవాతో సన్నిహిత పరిచయాన్ని పెంచుకుందట. తను ప్రభుదేవాని పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు బిటౌన్ కి చెందిన పలువురితో ఆ విషయాన్ని చెప్పుకుంటుంది. దీంతో ఈ న్యూస్ అందరినోటా పడి చివరకు కోలీవుడ్ కి కూడ చేరుకుంది. అయితే బిటౌన్ లో ఇంత ఓపెన్ గా ఈ న్యూస్ వినిపిస్తున్నప్పటీకీ, ప్రభుదేవా మాత్రం దీనిపై ఎటువంటి స్పంధన లేకుండా, తనకేమి తెలియనట్టు వ్యవహరిస్తున్నాడంట.

మరింత సమాచారం తెలుసుకోండి: