వర్మ తీస్తున్న మూవీలలో హాట్ కంటెంట్ ఎక్కువుగా ఉంటుందని అందరూ అనుకుంటారు. వర్మ ద్రుష్టిలో మాత్రం తను తీస్తున్నది ఓ ప్రొడక్ట్ మాత్రమే. దాన్ని ఎవరు ఎక్కువుగా కొంటారో, వారి కోసమే నేను తీసే సినిమా తప్ప మిగతా వారి కోసం కాదు అని స్ట్రాంగ్ స్టేట్ మెంట్స్ ఇచ్చిన సందార్భాలు అనేకం ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ గోపాల వర్మ బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కంటే టాలీవుడ్ లోనే ఎక్కువ మూవీలు తీస్తున్నారు. తను తీసిన అనుక్షణం అనే మూవీ రీసెంట్ గా రిలీజ్ అయింది. అయితే తాజాగా జరిగిన కరెంట్ తీగ ఆడియో ఫంక్షన్ లో రామ్ గోపాల్ వర్మ ఓ హీరోయిన్ కి ఫ్యాన్ అనే విషయం తెలిసింది. ఆ హీరోయిన్నే కెనడియన్ పోర్న్ స్టార్ సన్నీలియోన్. సన్నీలియోన్ కి రామ్ గోపాల్ వర్మ పెద్ద ఫ్యాన్. అయితే రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ ఓ కథని రెడీ చేసుకున్నాడు. అందులో హీరోయిన్ గా సన్నీలియోన్ ని ఓకే చేశాడని బిటౌన్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. వర్మ ఓ రొమాంటిక్ థ్రిల్లర్ కథని సన్నీలియోన్ కి చెప్పటం, సన్నీలియోన్ వెంటనే ఆ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. వర్మ, సన్నీలియోన్ ప్రాజెక్ట్ అక్టోబరు చివరి వారంలో సెట్స్ మీదకు వెళ్ళి, డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సంవత్సరం చివరిలో వర్మ, సన్నీలియోన్ ల కాంబినేషన్ తోనే ఫిల్మ్ ఇండస్ట్రీ 2014 హంగామా ఎండ్ అవుతుందంటూ బిటౌన్ లో వినిపిస్తున్న సమాచారం. హీరోయిన్స్ ను ఓవర్ ఎక్స్ పోజింగ్ తో చూపే వర్మ, ఏకంగా పోర్న్ స్టార్ సన్నీలియోన్ ని ఏ రేంజ్ లో చూసిస్తాడో అని, ఇప్పుటికే ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: