సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా వరస పెట్టి సినిమాలు తీస్తున్న రామ్ గోపాల్ వర్మ స్పీడ్ కు టాలీవుడ్ అదిరి పోతోంది. లేటెస్ట్ గా వర్మ దర్శకత్వం వహించిన ‘అనుక్షణం’ సినిమా ‘I SAW THE DEVIL’ అనే కొరియన్ సినిమాకు పక్కా జరాక్స్ కాపీ అనే వార్తలు వస్తున్నా వర్మ పట్టించుకోవడంలేదు. ప్రస్తుతం వర్మ దర్శకత్వం వహిస్తున్న ‘ఐస్ క్రీమ్-2’ విడుదల అయిన వెంటనే వర్మ తీయబోయే మరో సినిమాకు టైటిల్ డిసైడ్ చేసాడు అనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా టైటిల్ ‘వర్మతో సరళా ఆంటీ' అని అంటున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో రాని ఒక సరికొత్త కధాంశం తో వర్మ ఈ సినిమాకు శ్రీకారం చుడుతున్నాడని టాక్.  ఈ సరళా ఆంటీ పాత్రలో ఒక ప్రముఖ తార నటిస్తుందట. అయితే ఆ పేరు మాత్రం చివరి వరకు సస్పెన్స్ అని అంటున్నారు. మరి కొద్ది రోజులలో ఈ సినిమాకు సంబంధించిన అధికారక ప్రకటన ఉంటుందని ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. ఇది ఇలా ఉండగా ‘అనుక్షణం’ సక్సస్ తో సంబంధం లేకుండా వర్మ మంచు ఫ్యామిలీ బ్యానర్ లో మరో భారీ చిత్రాన్ని చేస్తాడు అనే వార్తలు కూడ వస్తున్నాయి. ఈ సినిమాలో ఒక ప్రముఖ హీరో నటిస్తాడని ఫిలింనగర్ గాసిప్. ఏమైనా వర్మ స్పీడ్ కు మంచు కుటుంబం వేగం కూడ తోడు అవ్వడంతో వర్మ ఏదోవిధంగా టాలీవుడ్ లో తన సత్తా చాటే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని  అనుకోవాలి .  

మరింత సమాచారం తెలుసుకోండి: