స్టైలిష్ స్టార్ గా పేరు గాంచిన అల్లుఅర్జున్ కొడుకు అయాన్ తన తండ్రిని మించిపోతాడు అంటూ అప్పుడే కామెంట్స్ మొదలైపోయాయి. దీనికి కారణం బన్నీ తన బుల్లి అయాన్ లేటెస్ట్ ఫోటోను తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో పెట్టడంతో అయాన్ లేటెస్ట్ ఫోటోకు అప్పుడే చాలామంది అభిమానులు అయిపోయి ఆ ఫోటోను తమ సన్నిహితులతో షేర్ చేసుకుంటున్నారు.  అంతేకాదు ఆరు నెలల అయాన్ క్యూట్ గా ఉన్నాడు అంటూ కామెంట్లు కూడ పెడుతూ, పెద్ద అయ్యాక అయాన్ తన తండ్రి బన్నీకే స్టైల్ లో సవాల్ విసురుతాడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేసుకోవడం అందర్నీ ఆకర్షిస్తోంది. బన్నీ కూడ తన కొడుకు విషయంలో చాల కేర్ తీసుకుంటూ అయాన్ అందంగా కనిపించే ఫోటోలను తన ఫేస్ బుక్ లో పెడుతూ ఇప్పటి నుంచే అయాన్ కు అభిమానులను తయారు చేస్తున్నాడు.  నాగార్జున చిన్న కొడుకు అఖిల్ కు చిన్ననాటి నుండే క్రేజ్ వచ్చినట్లుగా అయాన్ కు కూడ నెలల వయసులోనే క్రేజ్ రావడం బట్టి అల్లువారి ఇంట్లో నాల్గవ తరం హీరో అప్పుడే తయారవుతున్నాడా అని అనిపించే డట్లుగా ఈ బుల్లి స్టైలిష్ స్టార్ కనిపిస్తున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: