అల్లుఅర్జున్ త్రివిక్రమ్ ల లేటెస్ట్ సినిమాకు నటీనటుల ఎంపికలో ఒకనాటి హీరోయిన్ స్నేహ పేరు బయటకు రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. కన్నడ మీడియాకు స్నేహ ఈ విషయం స్వయంగా లీక్ చేసింది అని అంటున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు అనే వార్తలు ఇప్పటికే వచ్చినా మధ్యలో అనుకోకుండా స్నేహ పేరు తెర పైకి రావడం అందరికి షాకింగ్ గా మారింది. ఇప్పటికే ప్రారంభం కావలసిన ఈ సినిమా కధ విషయంలో మార్పులు చేర్పులు చోటు చేసుకోవడంతో ఈ సినిమా నిర్మాణం ఆలశ్యం అయింది. దసరా తరువాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది అని అంటున్నారు. ఇప్పటికే సమంత, ఆదా శర్మ హీరియిన్స్ గా ఎంపిక కాబడ్డ ఈ సినిమాలో మూడవ హీరోయిన్ పాత్రకు నయనతార, రాశి ఖన్నాల పేర్లు వినపడుతున్న నేపధ్యంలో మధ్యలో ఇలా అనుకోకుండా స్నేహ పేరు వచ్చి చేరడంతో అసలు స్నేహ పోషించే పాత్ర ఏమిటి అనే ఆశక్తికర చర్చలు అప్పుడే ఫిలింనగర్ లో మొదలు అయిపోయాయి.  త్రివిక్రమ్ తన ‘అత్తారింటికి దారేది’ సినిమా ద్వారా నదియాకు సెకండ్ ఇన్నింగ్స్ బ్రేక్ ఇస్తే ఇటువంటి బ్రేక్ కోసమే ఎదురు చూస్తున్న స్నేహకు బన్నీ ద్వారా త్రివిక్రమ్ బ్రేక్ ఇవ్వబోతున్నాడు అనుకోవాలి. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషలలో కూడ డబ్ చేసి బన్నీ మార్కెట్ ను మరింత పెంచే ఆలోచనలలో త్రివిక్రమ్ ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.  స్నేహ పై ఈ సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలు నిజం అయితే తెలుగు సినిమాకు మరి కొందరు అందమైన అక్కా, అత్తలు వచ్చినా ఆశ్చర్యం లేదు.   

మరింత సమాచారం తెలుసుకోండి: