మహేష్ రామ్ చరణ్ ల సినిమాలకు సంబంధించిన వార్తల హడావిడితో ఒకవైపు మీడియా హోరెత్తిపోతు ఉంటే మరో వైపు జూనియర్ కు సంబంధించిన నెగిటివ్ వార్తలతో మీడియా హడావిడి చేస్తోంది. వరస పరాజయాలు జూనియర్ కు ఎంత నిరాశ కలిగించాయో తెలియదు కాని, జూనియర్ పై వస్తున్న నెగిటివ్ వార్తల జోరు ఎన్టీఆర్ కు ఖచ్చితంగా షాకింగ్ గానే మారుతుంది. ‘రభస’ విడుదలకుముందే పూరి జూనియర్ ల కొత్తసినిమా మొదలై ఒక షెడ్యూల్ కూడ జరిగిన తరువాత పూరి జూనియర్ ల మధ్య ఏర్పడ్డ అభిప్రాయ బేధాలు ఈ సినిమాను నిర్మిస్తున్న బండ్ల గణేష్ కు తలనొప్పిగా మారాయి. కొన్ని రోజుల క్రితం ‘గోవిందుడు’ షూటింగ్ కోసం లండన్ లో ఉన్న బండ్ల గణేష్ తాను నిర్మిస్తున్న పూరి, జూనియర్ల సినిమా ఆగిపోయింది అని వస్తున్న రూమర్లకు చెక్ పెట్టే ఉద్దేశ్యంతో ఈ సినిమా ఆగదు అని ప్రకటన కూడ ఇచ్చాడు. అయినా ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కాలేదు సరికదా ఈ సినిమా ఆగిపోయింది అంటూ ఫిలింనగర్ లో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యలో బండ్ల గణేష్ కోరిక పై జూనియర్ తన పారితోషికాన్ని ఈ సినిమాకు సంబంధించి తగ్గించుకున్నాడు అనే వార్తలు కూడ వచ్చాయి.  అయితే అందరికి ఆశ్చర్యం కలిగించే విధంగా ఈమధ్యనే జూనియర్ దర్శకుడు సుకుమార్ ను తన వద్దకు పిలిపించుకుని గతంలో తనకు చెప్పిన కధను రెడీ చేస్తే అక్టోబర్ నుండే షూటింగ్ మొదలు పెడదాము అని మాట ఇచ్చినట్లుగా ఫిలింనగర్ టాక్. దీనిని బట్టి చూస్తూ ఉంటే జూనియర్ పూరి సినిమాకు పూర్తిగా మంగళం పాడేసినట్లే అని ఈ గ్యాప్ కు సుకుమార్ ని రంగంలోకి దింపాడు అనే వార్తలు ఫిలింనగర్ లో గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాను బండ్ల గణేష్ నిర్మిస్తడా? లేదా మరో కొత్త నిర్మాత వస్తాడా అన్న విషయం పై క్లారిటీ లేకపోయినా పూరీకి షాక్ సుకుమార్ కు జోష్ అనే సెటైర్లు వినపడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: