‘ఆగడు’ సినిమా షూటింగ్ మధ్యలో శ్రీనువైట్లకు, ప్రకాష్ రాజ్ కు వచ్చిన అభిప్రాయ భేదాలు ఆ సినిమా నుండి ప్రకాష్ రాజ్ ను బయటకు సాగనంపే వరకు కొనసాగాయి. ఆతరువాత ప్రకాష్ రాజ్ స్థానంలో సోను సూద్ చేరడం అన్నీ జరిగి పోయిన విషయాలే. అయినా ప్రకాష్ రాజ్ ‘ఆగడు’ సినిమా గురించి చాల పాజిటివ్ గా మీడియా ముందు మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రవితేజ నటించిన ‘పవర్’ సక్సస్ మీట్ లో మాట్లాడిన ప్రకాష్ రాజ్ ‘పవర్’ సినిమాను ప్రమోట్ చేస్తూ పనిలో పనిగా దసరాకు రాబోతున్న ‘గోవిందుడు అందరివాడేలే’, ‘ఆగడు’ సినిమాల ప్రస్తావన కూడ తన స్పీచ్ లో తీసుకు వచ్చాడు అని వార్తలు వస్తున్నాయి.  టాలీవుడ్ కు రెండు మంచి సినిమాలు రాబోతున్నాయని అందులో ఒకటి ‘గోవిందుడు అందరివాడేలే’ అయితే రెండవది ‘ఆగడు’ అంటూ షాకింగ్ కామెంట్ చేసాడు ప్రకాష్ రాజ్. అంతేకాదు ఈ రెండు సినిమాల పూర్తి కధలను తాను విన్నానని అంటూ ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అవడం ఖాయం అని కామెంట్ చేసాడు ప్రకాష్ రాజ్.  తాను ‘ఆగడు’ లో నటించకపోయినా ఆ సినిమా సూపర్ హిట్ ను తాను మనసారా కోరుకుంటున్నాను అని ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లు టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారడమే కాకుండా ప్రకాష్ రాజ్ వ్యక్తిత్వాన్ని చాటుతున్నాయి అంటూ కామెంట్లు వినపడుతున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: