నాగచైతన్యకు ఇంకా పెళ్లి కాని సందర్భంలో వెండితెర మన్మధుడు నాగ్ తాతగా ఎలా మారుతాడు అనే అనుమానం ఎవరికైనా వస్తుంది కాని ఇది నిజం. నాగార్జున తన కెరియర్ లో ఇప్పడి వరకు పోషించని తాతయ్య పాత్రను తను నటించే లేటెస్ట్ సినిమాలో పోషించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ‘మనం’ మూవీతో సూపర్ హిట్ కొట్టిన నాగ్ తన జోష్ ను కొనసాగిస్తూ నటించబోతున్న లేటెస్ట్ మూవీలో రొటీన్ కు భిన్నంగా వైవిధ్యమైన ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు అనే వార్తలు గతంలోనే వచ్చాయి. అయితే అందరు ఈ సినిమాలో నాగార్జున తండ్రి, కొడుకులుగా రెండు పాత్రలలో కనిపిస్తాడు అని అనుకున్నారు అంతా. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ నాగ్ ఇందులో తాత, మనవడి పాత్రలను పోషిస్తున్నాడు. నూతన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో తాతపాత్ర చేయబోతున్న నాగ్ కు జంటగా రమ్యకృష్ణ నటించబోతోంది.  మనవడి పాత్రలో నటిస్తున్న నాగ్ కు జంటగా తమన్నాను అనుకున్నా ఆమె చెప్పిన భారీ పారితోషికం విని నాగ్ షాక్ అయి ముంబాయ్ కు చెందిన మరో కొత్త హీరోయిన్ తో రోమాన్స్ చేస్తాడని టాక్. "సోగ్గాడే చిన్ని నాయన" అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా వివరాలను అధికారికంగా రేపు జరగబోతున్న అక్కినేని పుట్టినరోజు సందర్భంగా జరగబోయే వేడుకలలో స్వయంగా నాగార్జున ప్రకటిస్తాడు అని టాక్. ఏమైనా నాగ్ చైతూకు పెళ్లి కాకుండానే తాతగా మారుతున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: