అక్కినేని తనయుడు అఖిల్ సినిమాకు సంబంధించిన ప్రకటన రేపు జరగబోతున్న అక్కినేని జయంతి ఉత్సవాలలో నాగార్జున నోటి వెంట వస్తుందనే వార్తలు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి. రకరకాల దర్శకుల పేర్ల పరిశీలనతరువాత అక్కినేని కుటుంబం అఖిల్ నటించబోయే తొలి చిత్రానికి దర్శకుడిగా వినాయక్ ను ఎంపిక చేయడానికి సుముఖంగా ఉంది అనే వార్తలు కూడ వినపడుతున్నాయి.  చిరంజీవి 150వ సినిమాకు కధ ఎప్పుడు దొరుకుతుందో తెలియని పరిస్థుతులలో వినాయక్ కూడ అవకాశం లభిస్తే అఖిల్ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అక్కినేని కుటుంబానికి ఒక భారీ బహుమతి ఇచ్చే ఉద్దేశ్యంతో ఒక మాస్ ఎంటర్ టైనర్ కధను అఖిల్ కోసం రెడీ చేయడానికి సుముఖంగా ఉన్నాడు నే టాక్ కూడ ఉంది. ఇప్పటిదాకా ఈ సినిమాను తానే నిర్మిద్దాం అని అనుకున్న నాగార్జున ఆలోచనలను హీరో నితిన్ అతని తండ్రి సుధాకరరెడ్డి ప్రభావితం చేసి అఖిల్ ఎంట్రీ ఇచ్చే సినిమాను నిర్మించడానికి నాగ్ నుండి అనుమతి పొందారు అనే వార్తలు కూడ గట్టిగా వినిపిస్తున్నాయి. దీనికి కారణం అఖిల్ నటించబోయే మొట్టమొదటి సినిమాకు నిర్మాతగా తాను ఉండటం కన్నా బయట వ్యక్తులు నిర్మాతలుగా వ్యవహరిస్తే అ సినిమా క్వాలిటీ విషయంలో మరింత మెరుగులు వచ్చే అవకాసం ఉందని నాగ్ అభిప్రాయం అని అంటున్నారు.  అదీకాక నాగార్జున నటిస్తూ తానే స్వయంగా నిర్మిస్తున్న ఒక కొత్త చిత్రం వచ్చే నెలలో ప్రారంభం అవుతున్న నేపధ్యంలో ఒకేసారి రెండు సినిమాలను తన బ్యానర్ పై నిర్మించడం కన్నా అఖిల్ సినిమాను బయట నిర్మాతలచేత చేయించడం మంచిది అన్న ఉద్దేశ్యంతో నాగ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అని అంటున్నారు. మరి ఇప్పటి దాకా పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా ఉన్న నితిన్ అక్కినేని వంశ భజన చేస్తాడేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: