మెగా కుటుంబానికి నందమూరి బాలకృష్ణకు సరైన సంబoధాలు లేవు అన్నది ఓపెన్ సీక్రెట్. అప్పుడప్పుడు చిరంజీవి బాలకృష్ణ పై పేరు పెట్టకుండా సెటైర్లు కూడ వేస్తూ ఉంటాడు. అటువంటి మెగాకుటుంబ హీరో రామ్ చరణ్ బాలయ్యను అనుసరిస్తున్నాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి. చిరంజీవి ‘గోవిందుడు అందరివాడేలే’ ఆడియో వేడుకలో పవన్ ను ఉద్దేసించి మాట్లాడుతూ తన తమ్ముడు ‘గోవిందుడు’ 150వ రోజు వేడుకలకు వస్తాడు అంటూ కామెంట్ చేసిన సందర్భం బాలకృష్ణను అనుసరిస్తున్నట్లుగా ఉంది అని అంటున్నారు. దీనికి కారణం ఈ సంవత్సరం విడుదల అయిన బాలకృష్ణ ‘లెజెండ్’ సినిమా సూపర్ హిట్ అయినా ఆ సినిమా శతదినోత్సవాన్ని మాత్రం నిర్వహించలేదు.  కాని ‘లెజెండ్’ రెండు కేంద్రాలలో 175 రోజులు ప్రదర్శింపబడ్డ ఉత్సవాన్ని ఈ నెలాఖరులో ప్రొద్దుటూరులో నిర్వహిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఫంక్షన్ కు ‘లెజెండ్’ యూనిట్ అంతా హాజరు అవుతుందని టాక్. అదేవిధంగా చరణ్ నటించిన ‘గోవిందుడు’ సినిమా హిట్ అయినా వంద రోజుల శతదినోత్సవాన్ని చేయకుండా కేవలం 150 రోజుల పండుగ మాత్రమే చేస్తారా అన్నట్లుగా చిరంజీవి మాటలు ఉన్నాయని విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు.  అంతేకాదు అనుకోకుండా చిరంజీవి రామ్ చరణ్ లు బాలయ్య బాటనే ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా విషయంలో అనుసరిస్తూ ఇష్టం లేకపోయినా బాలయ్య బాటనే మెగా కుటుంబం ఎంచుకుందా ? అనే సెటైర్లు ఫిలింనగర్ లో వినపడుతున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: