సినిమాలు తీయడంలోనే కాదు తాను మైక్ పట్టుకుని యాంకరింగ్ అవతారం ఎత్తితే ప్రస్తుతం ఆడియో ఫంక్షన్స్ ను ఏలుతున్న యాంకర్లు కూడా కనుమరుగైపోయే పరిస్థితి వస్తుంది అని అనుకునే విధంగా నిన్న సాయంత్రం తెలుగు సినిమా జక్కన్న రాజమౌళి 'దిక్కులు చూడకు రామయ్య' ఆడియో వేడుకలో తన యాంకరింగ్ అవతారం చూపెట్టి అందర్నీ అదరగొట్టాడు. రాజమౌళి శిష్యుడు త్రికోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆడియో రొటీన్ కు భిన్నంగా జరిగి అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. సామాన్యంగా ఆడియో వేడుకలలో ఉండే గ్రూప్ డాన్స్ లు లేకుండా టాలీవుడ్ సెలెబ్రెటీల పై తయారుచేసిన కామెడీ వీడియోలను రాజమౌళి సెటైరికల్ వ్యాఖ్యానంతో చూపెడుతూ రాజమౌళిలో ఇంత యాంకరింగ్ విశ్వరూపం ఉన్నదా అని అనిపించేడట్లుగా ఈ ఆడియో రిలీజ్ విభిన్నంగా జరిగింది. నాగార్జున ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ ఈ సినిమా దర్శకుడు త్రికోటితో పాటు తాను కూడా దర్శకుడు క్రాంతి దగ్గర అసిస్టెంట్లుగా పనిచేశామని చెపుతూ తనకంటే త్రికోటి సీనియర్ అయినా తను ముందుగా దర్శకుడిగా మారడంతో తన దగ్గర చాల సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేసి ఇప్పుడు ‘దిక్కులు చూడకు రామయ్య’ కు దర్శకుడిగా మారిపోయి తన దగ్గర నుండి వెళ్లిపోవడంతో ప్రస్తుతం తను తీస్తున్న ‘బాహుబలి’ కష్టాలనుండి త్రికోటి తప్పించుకున్నాడు అంటూ జోక్ చేసాడు రాజమౌళి.  జక్కన్నకు అత్యంత ఆప్తుడిగా పేరుగాంచిన కొర్రపాటి సాయి నిర్మిస్తున్న ఈ సినిమా వెనుక రాజమౌళి ప్రమేయం ఉంది అని వస్తున్న వార్తలకు బలం చేకూరుస్తూ ఇంచుమించు రాజమౌళి టీమ్ ఈ సినిమాకు పనిచేయడం బట్టి త్రికోటి రూపంలో రాజమౌళి తీస్తున్న సినిమా ‘దిక్కులు చూడకు రామయ్యా’ అని అంటున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: