మాస్ మహారాజా రవితేజ ఈరోజు ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లేటెస్ట్ గా రిలీజ్ అయిన తన ‘పవర్’ సినిమా గురించి అనేక ఆశక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. తన సినిమాలకు మొదటిరోజు డివైడ్ టాక్ వస్తే తనకు ఎంతో కలిసి వస్తుందని తాను నటించిన ‘విక్రమార్కుడు’ కి కూడ సినిమాకు కూడా మొట్టమొదట డివైడ్ టాక్ వచ్చి ఆ తరువాత సూపర్ హిట్ మూవీగా మారిందని అదే సాంప్రదాయం తన లేటెస్ట్ సినిమా పవర్ సినిమా విషయంలో కూడ జరిగింది అని అన్నాడు.  అంతేకాదు ప్రస్తుత పోటీ వాతావరణంలో ఏ సినిమా హీరోకైనా తాను నటించిన సినిమాలకు మొదటిరోజు మొదటి షోకు పాజిటివ్ టాక్ వచ్చే అవకాశాలు చాల తక్కువగా ఉన్నాయని అదే విషయం తన ‘పవర్’ విషయంలో జరిగినా తరువాత కలెక్షన్స్ విషయంలో నిలబడింది అని అంటున్నాడు. ‘విక్రమార్కుడు’ సినిమాకు ‘పవర్’ కు పోలిక ఉంది అనే కామెంట్స్ చేస్తున్న విమర్శకుల పై దాడి చేస్తూ ఈ రెండు సినిమాలలోను హీరోది పోలీసు పాత్ర అయినంత మాత్రాన పోలీసులు ఒకే సమస్యను డీల్ చేస్తూ కూర్చోరు కదా అంటూ ‘పవర్’ సినిమాను సమర్ధించుకున్నాడు రవితేజ.  ఈ చిత్ర దర్శకుడు బాబి త్వరలోనే టాలీవుడ్ లో టాప్ 5 దర్శకులలో ఒకడుగా మారుతాడు అంటూ బాబీని ఆకాశానికి ఎత్తేశాడు రవితేజ. తాను మీడియాకు అలాగే రచయితలకు పెద్దగా అందుబాటులో ఉండను అనే విషయం పై కామెంట్ చేస్తూ తాను అజ్ఞాతవాసం చేయడం లేదని ఎటొచ్చీ చాలామంది హీరోలులా తరుచు మీడియా ముందు సందడి చేసే అలవాటు తనకు లేదని తన పై తానే సెటైర్లు వేసుకున్నాడు మాస్ మహారాజా.  

మరింత సమాచారం తెలుసుకోండి: