కోట్లాది రూపాయల పెట్టుబడితో గంటలలో తేల్చివేసే ఫలితంతో నిర్మాణం అవుతున్న తెలుగు సినిమా దర్శక నిర్మాతలకు హీరోలకు రోజురోజుకు పెరిగి పోతున్న మూఢనమ్మకాలు టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారుతున్నాయి. దర్శకేంద్రుడిగా ఎన్నో హిట్లు కొట్టిన రాఘవేంద్రరావుకు తాను దర్శకత్వం వహించే సినిమా షూటింగ్ మొదలు కాగానే ఆ సినిమా పూర్తి అయ్యేవరకు తన గెడ్డంతో పాటు తన మీసాన్ని కూడ కనీసం ట్రిమ్ కూడ చేయడట. అదేవిధంగా మెగా స్టార్ చిరంజీవి అయితే తాను నటించిన సినిమా సూపర్ హిట్ కావాలి అంటే కనీసం ఒక్క పాటలో అయినా వైట్ ప్యాంటు తో కనిపించాలనే భారీ సెంటిమెంట్ ఉందట. ఇక మహేష్ బాబు అజ్మీర్ దర్గా సెంటిమెంట్ అందరికి తెలిసిన విషయమే. అల్లుఅర్జున్ కు అయితే తాను నటించే సినిమాలో కనీసం ఒక్క సీన్ అయినా విశాఖపట్నంలో తీస్తేగాని సక్సస్ రాదు అనే మూఢనమ్మకo ఉంది అంటారు.  ఒకనాటి ప్రముఖ దర్శకుడు భారతీరాజాకు అయితే తన సినిమాలలో ‘ర’ అనే మొదటి అక్షరంతో ఉండే హీరోయిన్స్ నటిస్తేనే తన సినిమాలు సూపర్ హిట్ అవుతాయి అన్న నమ్మకంతో రాధా, రాధిక, రేవతి లతో అనేక సినిమాలు తీసాడు అనే టాక్ ఉంది.  ఇలాంటి మూఢనమ్మకాలనే కొనసాగిస్తూ బండ్ల గణేష్, దిల్ రాజ్, రామనాయుడు, బెల్లంకొండ సురేష్ లాంటి బడా నిర్మాతలు కూడ తమ సినిమాల్ ఆడియో కాపీని మొట్టమొదటిగా తాము ఇష్టపడే దీవాలయాలకి వెళ్లి పూజలు చేసిన తరువాతే సినిమా పబ్లిసిటీ మొదలు పెడతారు అనే ప్రచారం ఉంది. కధలో కధనంలో కొత్తదనం లేకుండా ఎన్ని ఆలయాల చుట్టూ తిరిగినా ఫలితం ఉండదు అన్న విషయాన్ని మన సెలెబ్రెటీ లు ఎప్పటికి గుర్తిస్తారో మరి.  

మరింత సమాచారం తెలుసుకోండి: