అలీ గురించి ఇవాళ కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. నవ్వించడానికే పుట్టినట్టుగా ఉంటాడు. ఎక్కడుంటే అక్కడ నవ్వుల పువ్వులు పూయిస్తాడు. వెండితెర మీద నవ్వుల సంతకం చేస్తాడు. అదే మంత్రాన్ని బుల్లితెర మీద కూడా ప్రయోగించాడు. అందుకే ‘అలీ 369’ షో అంత సక్సెస్ అయ్యింది. ఆ షో పూర్తయిపోయినప్పుడు అలీ అభిమానులు చాలా బాధపడ్డారు. మంచి షోను మిస్సవుతున్నామే అని ఫీలయ్యారు. అందుకే వారికి సంతోషాన్ని కలిగించడానికి వెనువెంటనే వచ్చేశాడు అలీ. జెమినీ చానెల్లో ‘ఏటీఎం’ పేరుతో మొదలైన అలీ గేమ్ షో మళ్లీ దుమ్ము రేపుతోంది. సెలెబ్రిటీలను ఆటాడిస్తూ, వారి ఆటకు తన కామెడీని జత చేస్తూ... అత్యద్భుతంగా ఎంటర్‌టైన్ చేస్తున్నాడు అలీ. మంచు లక్ష్మి, కామ్నా జెఠ్మలానీ, నీహారిక లాంటి వాళ్లతో అతడు షోని నడిపించిన తీరుకు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. ముందు ముందు ఇంకెవరిని తీసుకొస్తాడో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఎంటర్‌టైన్ చేయడానికి వెండితెర అయినా, బుల్లితెర అయినా ఒకటే అని నిరూపిస్తున్నాడు మన కామెడీ స్టార్!

మరింత సమాచారం తెలుసుకోండి: