వయస్సు ఐదు పదులకు దగ్గర పడుతున్నా బాలీవుడ్ సినిమాలకు ఇప్పటికీ క్రేజీ హీరో ఎవరు అంటే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పేరు చెపుతారు. ప్రస్తుతం వెబ్ మీడియాలో కోటి మంది అభిమానులతో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న అమితాబ్ ట్విటర్ అనుచరుల సంఖ్యకు దగ్గరలో చేరిపోతున్నాడు షారుఖ్.  లేటెస్ట్ గా షారుఖ్ కు 90 లక్షల మంది వెబ్ మీడియాలో అనుచరులుగా నమోదు అయ్యారు అనే వార్తలు వస్తున్నాయి. దీనితో వెబ్ మీడియాకు సంబంధించిన అనుచరుల రికార్డులలో ప్రస్తుతం అమితాబ్ తరువాత రెండవ స్థానంలో షారుఖ్ కొనసాగుతున్నా త్వరలో విడుదలకాబోతున్న షారుఖ్ ‘హ్యాపీ న్యూయియర్’ అంచనాలకు అనుగుణంగా సూపర్ హిట్ అయితే వెబ్ మీడియాలో అత్యధిక ఫాలోయర్స్ ఉన్న హీరోగా షారుఖ్ రికార్డులు క్రియేట్ చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనుకోవాలి. వెబ్ మీడియాకు సంబంధించి అత్యధిక ఫాలోయర్స్ రికార్డులో మూడవ స్థానంలో అమీర్ ఖాన్ ఉంటె నాల్గవ స్థానంలో సల్మాన్ ఖాన్ కొనసాగుతున్నారు. ఈ వార్తలు ఇలా ఉండగా అతి త్వరలోనే షారుఖ్ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ తో తిరిగి 12 సంవత్సరాల తరువాత రోహిత్ శెట్టి నిర్మిస్తున్న సినిమాలో నటించబోతున్నాడు అనే వార్తలు బాలీవుడ్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: