గ్లామర్ ఒలకపోస్తూ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లలో కోట్లు గణిస్తున్న శ్రుతిహాసన్ కు తన అందం పై తనకే మోజు తీరినట్లు ఉంది. అందుకే మీడియా ముందు వింత వ్యాఖ్యలు చేసింది. అందంగా ఉంటె సరిపోదు దానికి తగ్గ తెలివితేటలు కూడ కావాలి అని అంటోంది.  ‘‘తెలివి తేటలు లేని అందం నా దృష్టిలో వేస్ట్. ఎందుకంటే మన జీవితం సరైన మార్గంలో వెళ్లాలంటే తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడే విజయం వస్తుంది’ అని అంటూ కామెంట్స్ విసిరింది శ్రుతి. తెర పై అందంగా కనిపించే తమ అందం అంతా తమ సొంతం కాదని మేకప్ చేయడానికి ఒకరు, హెయిర్ స్టయిల్ చేయడానికి మరొకరు తీర్చి దిద్దిన అందం తమది అని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రుతి. అందం తీర్చి దిద్దడానికి ఎంతో మంది సహకరిస్తారని కానీ, తెలివితేటలకు మెరుగులు దిద్దడానికి ప్రత్యేకంగా ఎవరూ ఉండరు అని అంటోంది ఈ బ్యూటీ. అందుకనే మనం చేసే తప్పొప్పులే మనకు మంచి పాఠాలు కాబట్టి వాటి ద్వారా మనం తెలివితేటలు పెంచుకోవాలి అని చెపుతోంది శ్రుతి.  అయితే తెలివితేటలు గురించి ఇంత అవగాహన ఉన్న శ్రుతి ఏమాత్రం కిక్ ఇవ్వని ఒక ఐటమ్ సాంగ్ ‘ఆగడు’ సినిమాలో ఎందుకు చేసిందో ఆమెకే తెలియాలి. అయినా ‘బ్యూటీ విత్ బ్రెయిన్’ గా ఎదగాలి అని అనుకుంటున్న శ్రుతి నిర్ణయం మంచిదే.  

మరింత సమాచారం తెలుసుకోండి: