నాగార్జున తాను నిర్మించే సినిమాల దగ్గర నుంచి తాను చేసే వ్యాపారాల వరకు చాల డిఫరెంట్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. అటువంటి నాగ్ ఈ సెల్ ప్రపంచలో తిరిగి ఉత్తరాలు వ్రాసే పద్దతి మొదలు పెడతాను అని నాగ్ స్వయంగా ప్రకటించాడు. మొన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన అక్కినేని జయంతి వేడుకలలో నాగ్ ఈ ప్రకటన చేసాడు. అక్కినేని పై అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన పోస్టల్ స్టాంప్ ను అక్కినేని జయంతి వేడుకలలో విడుదల చేస్తూ నాగ్ ఈ స్టాంప్ లను ఉపయోగించుకోవడానికి తాను త్వరలో అమెరికా వెళ్లి అక్కడ నుండి తన అభిమానులందరికి అక్కినేని స్టాంప్ లను ఉపయోగిస్తూ వందలాది ఉత్తరాలను రాస్తానని ఆశక్తికర ప్రకటన చేసాడు నాగార్జున. కుటుంబ తరహా సినిమాలు అంటే ఇష్టపడే అక్కినేని తన చివరి సినిమాగా నటించిన ‘మనం’ సినిమా కూడ కుటుంబ సినిమాగా మారడమే కాకుండా రికార్డులను క్రియేట్ చేయడం అక్కినేనికి ఘనమైన నివాళి అంటూ తన తండ్రి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నాడు నాగార్జున. స్వామివివేకానంద, మహాత్మాగాంధీ, రాజ్ కపూర్ ల లాంటి ప్రముఖుల గౌరవార్ధం గతంలో పోస్టల్ స్టాంప్ లను విడుదల చేసిన అమెరికా ప్రభుత్వం అదే స్థాయిలో గౌరవిస్తూ అక్కినేని పై ఈ స్టాంప్ ను విడుదల చేయడం టాలీవుడ్ కీర్తికి మకుటాయమానంగా భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా సినిమా రంగానికి అద్భుతమైన సేవలు అందించిన ప్రతిభావంతులను గౌరవించాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన అక్కినేని నాగేశ్వరరావు ‘ఏయన్నార్ జాతీయ అవార్డు’ కి ఈసారి అమితాబ్ ను ఎంపిక చేయడంపట్ల టాలీవుడ్ ప్రముఖులు అందరు తమ హర్షం తెలియచేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: