ఈమధ్యనే ఒక ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక తన ఫోటోల పై చేసిన అసభ్యకరమైన కామెంట్ల పై నిప్పులు చెరుగుతూ సమాజంలో మహిళలను గౌరవించండి, మహిళా సాధికారతకు ప్రాధాన్యమివ్వండి, పురుషాధిక్యత నశించాలి అని గగ్గోలు పెట్టిన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ చెప్పిన మాటలకు చేస్తున్న చేతలకు సంబంధం లేదు అంటూ మీడియా ఆమె పై ఎదురు దాడి మొదలు పెట్టింది.  అంతేకాదు ప్రస్తుతం దీపిక నటిస్తున్న సరికొత్త సినిమా ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రంలోని ‘లవ్లీ’ అనే సరికొత్త పాటలో దీపిక హాట్ హాట్ గా కనిపిస్తున్న ఫోటోలను పత్రికలలో ప్రచురిస్తూ దీపికా? నీ సమాధానం ఏమిటి అని ప్రశ్నిస్తూ కామెంట్స్ పెడుతోంది మీడియా. అసభ్య వస్త్రధారణతో సినిమాలలో ఎలా నటించినా ఫరవాలేదు కాని కామెంట్స్ చేస్తే దీపిక భరించదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది మీడియా. మరి తన పై మొదలైన మీడియా ఎదురు దాడికి దీపిక మళ్ళీ ఎటువంటి ఘాటు వ్యాఖ్యలు చేస్తుందో అనే ఆశక్తి ఇప్పుడు అందరిలోనూ ఉంది. ఈ వార్తలు ఇలా ఉండగా ‘హ్యాపీ న్యూ ఇయర్’ లో దీపిక ఆరబోసిన అందాలు ఈ సినిమా నిర్మాతలకు బయ్యర్ల దగ్గర నుండి కాసులను బాగానే కురిపిస్తున్నాయని బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: