శ్రీనువైట్ల నుండి బయటకు వచ్చిన తరువాత కోన వెంకట్ కు కాలం బాగా కలిసి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో నిర్మాతగా భారీగా నష్టపోయినా తిరిగి నిర్మాతగా చేసిన ‘గీతాంజలి’ ప్రయోగం విజయవంతం అయింది. ఆ తరువాత కోన వెంకట్ డైలాగ్స్ రాసి ఈ మధ్యనే వచ్చిన ‘పవర్’ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తూ ఉండటంతో ప్రస్తుతం కోన వెంకట్ కెరియర్ తిరిగి గాడిలో పడినట్లే కనిపిస్తోంది. చాల మంది రచయితలు దర్శకులుగా మారి కోట్లు గణిస్తూ ఉండటంతో ఇతడి దృష్టి కూడా గత కొద్ది కాలంగా దర్శకత్వం పై మళ్ళింది అనే వార్తలు వినపడుతున్నాయి. ఆ మధ్యన కోన వెంకట్ శ్రీదేవికి ఓ సబ్జెక్ట్ చెప్పి ఒప్పించి తనే డైరెక్ట్ చేస్తానని అడిగినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే కోన వెంకట్ కోరికకు శ్రీదేవి భర్త బోనికపూర్ సహకరించక పోవడంతో ఆ సినిమా పట్టాలు ఎక్కలేదు.  దీనికి తోడు కోన వెంకట్ ఎప్పటి నుంచో పవన్ పై కన్నేశాడు అనే వార్తలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా వెంకట్  ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అదంతా గతం. ప్రస్తుతం వెంకట్ కు దేవుడు రూపంగా రవితేజా మారాడు అనే వార్తలు ఊపు అందుకున్నాయి.  పవర్ సక్సస్ తో మంచి కిక్ మీద ఉన్న రావితేజాకు కోన వెంకట్ ఒక కధ చెప్పాడని ఈ కధ బాగా నచ్చడంతో రవితేజా కోనవెంకట్ తోనే దర్శకత్వం చేయిద్దామనే ఆలోచనలో మాస్ మహారాజ ఉన్నాడు అంటూ ఫిలింనగర్ లో వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఈ సినిమాకు కోన వెంకట్ ‘రంగు పడుద్ది’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లుగా గాసిప్ ల హడావిడి జరుగుతోంది. ఇంతకీ కోన వెంకట్ విసిరే రంగుల వలలో మాస్ మహారాజా చిక్కుకుంటాడో లేదో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: