పవన్ కళ్యాణ్ తన ఆరోగ్యం పై వస్తున్న రూమర్స్ ను చీల్చి చెండాడుతూ మొన్న ఆదివారం అర్దరాత్రి తన మోటార్ బైక్ పై హైటెక్ సిటీలో హంగామా చేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. మీడియా వార్తల ప్రకారం మొన్న అర్దరాత్రి సుమారు 1 గంట ప్రాంతంలో పవన్ తాను ‘గోపాల గోపాల’ కోసం వాడుతున్న మోటార్ బైక్ పై హైటెక్ ప్రాంతంలో చెక్కర్లు కొట్టడం కొంతమందికి కనిపించింది. పవన్ బైక్ వెనుక నెంబర్ ప్లేట్ స్థానంలో ‘ఓమ్’ అనే అక్షరాలు కనిపించాయి. అర్దరాత్రి సమయం అయినా పవన్ ను గుర్తు పట్టిన అభిమానులు ఆ మోటారు బైక్ వెనుక పరుగులు తీస్తే అది ‘గోపాల గోపాల’ కోసం చిత్రీకరించిన షాట్ అని తెలిసింది. దీనితో ఆశ్చర్యపోయిన పవన్ అభిమానులు ఈ షూటింగ్ సన్నివేశాన్ని తమ సెల్ కెమెరాలలో బంధించి తమ స్నేహితులకు పవన్ అభిమానులకు షేర్ చేసుకున్నారు. లైటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల అభిమానులు తీసిన ఈ ఫోటోలలో క్లారిటీ లేకపోయినా ఆ ఫోటోలను పవన్ అభిమానులందరూ వెబ్ మీడియా ద్వారా షేర్ చేసుకోవడం దానిపై లైక్స్ రావడం కూడా జరిగిపోయింది. వచ్చే సంక్రాంతికి విడుదలకబోతున్న ఈ గోపాలుడికి పోటీగా టాప్ హీరోల సినిమాలు ఏమి లేకపోవడంతో ఈ సినిమాకు కలెక్షన్స్ సునామి ఖాయం అనే వార్తలు ఇప్పటి నుండే మొదలు అయిపోయాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: