‘రభస విడుదలకు ముందు ప్రారంభమై రకరకాల కారణాలతో గాసిప్ లకు కేంద్ర బిందువుగా మారిన ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా విడుదల కాకండానే ఈ సినిమా ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేసిందని టాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు. వారు విశ్లేషిస్తున్న సమాచారం ప్రకారం పూరి, జూనియర్ల సినిమా మొదలుపెట్టాక ఇప్పటి వరకు తొమ్మిది సార్లు ఈ సినిమా షెడ్యూల్ క్యాన్సిల్ అయిందట. టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ పెద్ద హీరో చిత్రం ప్రారంభం అయ్యాక ఇన్నిసార్లు షూటింగ్ క్యాన్సిల్ అవడం జరగలేదని ఈ విషయంలో మాత్రం పూరి జూనియర్ల సినిమా క్రియేట్ చేసిన రికార్డును మిగతా హీరోలు అందుకోవడం కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు. ప్రతీసారి షెడ్యూల్ వేసుకోవటం, ఆర్టిస్టుల ఫ్రెష్ డేట్స్ తీసుకోవటంతోనే రోజులు గడిచిపోతున్నాయని ఫిలింనగర్ టాక్. బహుశా ఈ వార్తలు పూరి, జూనియర్ల వరకు వెళ్ళి ఉంటాయి అందుకే ఈ సినిమా షూటింగ్ ను ఈ నెల 26 నుంచి ప్రారంభంకాబోతోంది అనే వార్తలు వస్తున్నాయి. ఈ షెడ్యూల్ లో హాలీవుడ్ మూవీ స్థాయిలో ఒక చేజింగ్ అండ్ ఫైటింగ్ సీన్ కోసం 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారని ఫిలింనగర్ వర్గాల టాక్.  దీనికి తోడు త్వరలోనే జూనియర్ సన్నీలియోన్ లపై ఒక భారీ ఐటమ్ సాంగ్ ను షూట్ చేసే ఆలోచన కూడ చేస్తున్నాడట పూరి. ఏమైనా అనుకున్న విధంగా ఈనెల 26 నుండి అయినా ఈ సినిమా తన కష్టాలనుండి బయట పడి స్పీడ్ అందుకుంటే జూనియర్ కోరుకుంటున్న సంక్రాంతి రేసుకు ఈ సినిమా సిద్దం అయ్యే అవకాసం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: