‘ఆగడు’ పరాజయంతో తీవ్ర నిరాశలో ఉన్న మహేష్ బాబు అభిమానులకు జోష్ కలిగించే సంఘటన ఈరోజు జరిగింది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ లాగే చాలా క్యూట్ గా ఉండే మహేష్ కూతురు సితార తన తండ్రి అభిమానులను వారి తీవ్ర నిరాసనుండి బయటకు తీసుకు రావడానికి ‘ఆగడు’ చిత్రంలోని 'తూ ఆజా సరోజా' పాటకు డాన్స్ చేసింది. పూర్తిస్థాయిలో డాన్స్ కాకపోయినా తన చిన్న చేతులు ఊపుతూ తనకు చేతనైనట్లుగా డాన్స్ చేసి మహేష్ అభిమానుల నిరాశను తొలగించడానికి ప్రయత్నం చేసింది ఈ చిన్నారి. పింక్ కలర్ ఫ్రాక్ వేసుకుని చేతులకు గ్లోవ్స్ వేసుకుని సితార డాన్స్ చేస్తూ ఉంటే చుట్టూ ఉన్నవాళ్లు అంతా తమ సెల్ ఫోన్ లలో షూట్ చేస్తూ సితారను ఉత్సాహ పరుస్తున్నారు. ఇంతకుముందు తన తండ్రి ఎత్తుకుని ఉంటే మహేష్ ముక్కు మీద తన బుల్లి వేలు ఉంచిన సితార ఫొటో సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో ఇప్పుడు సితార డాన్స్ వీడియోను అందరు ఆశక్తిగా చూడటమే కాకుండా మహేష్ అభిమానులు ఒకరికి ఒకరు షేర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో హడావిడి చేస్తోంది. 'ఆగడు' చిత్రానికి సంబంధించిన వాళ్లే ఈ వీడియోను తీసి యూట్యూబ్ లో పెట్టి ఉంటారని భావిస్తున్నారు. ఏమైనా ఈ రోజు వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మహేష్ కూతురు సితార మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: