పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరస పెట్టి మూవీలను తీస్తానంటే బడా నిర్మాతలు సైతం కోట్ల రూపాయల అడ్వాన్స్ ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో బడా హీరోలు ఓ రెండు మూవీలకి ముందుగా అడ్వాన్స్ మనీని తీసుకోవడం జరుగుతుంది. అయితే ఒక్కోసారి ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయితే మాత్రం, తీసుకున్న అడ్వాన్స్ మనీను అతి తక్కువ సందర్భాల్లోనే నిర్మాతలకి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఒకసారి అడ్వాన్స్ గా ఇచ్చిన మనీని తిరిగి ఇవ్వడం అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా అరుదుగా జరుగుతుంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గతంలో ఓ నిర్మాత వద్ద నుండి 6.5 కోట్ల రూపాయల మనీని అడ్వాన్స్ గా తీసుకున్నాడు. ప్రస్తుతం ఆ మనీని పవన్ కళ్యాణ్ నిర్మాతకి ఇచ్చేశాడు. మేటర్ లోకి వెళితే, సార్వత్రిక ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి బీజేపీ-టీడీపీ కూటమికి బ్యాక్ బోన్ గా నిలిచాడు. జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాద్, వైజాగ్ లలో బహిరంగ సభలు నిర్వహించాడు. ఈ సభల కోసం పీవీపీ ప్రసాద్ 6.5 కోట్ల రూపాయలను తన అకౌంట్ నుంచి ఖర్చు పెట్టారు. ఈ మొత్తాన్ని, పవన్ తో తను తీయబోయే చిత్రానికి ఇచ్చిన అడ్వాన్స్ గా పీవీపీ ప్రసాద్ లెక్కలు సరిచేసుకుంటానని పవన్ కి చెప్పాడంట. ఈ వ్యవహారం మీడియాకి లీకై పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మనీ ఫండర్ అంటూ పివీపి పై పలు కథనాలు వచ్చాయి. అందుకనే ఆయనకు విజయవాడ టీడీపీ టిక్కెట్టు ఇచ్చేందుకు పవన్ లాబీయింగ్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే అనుకోని కారణాల వల్ల పవన్ తో పీవీపీ ప్రసాద్ తీయాల్సిన సినిమా కూడా ప్రస్తుతానికి అటకెక్కింది. దీంతో పీవీపీ సంస్థతో సినిమా లేదు కాబట్టి, ఆ మొత్తాన్ని పవన్ వెంటనే తిరిగి ఇచ్చివేసినట్లుగా టాలీవుడ్ లో క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గోపాల గోపాల మూవీకి సంబంధించిన షూటింగ్ లో బిజిగా ఉన్నాడు. ఈ మూవీ తరువాత తను నటించబోయో గబ్బర్ సింగ్2 మూవీ ప్రాజెక్ట్ ఉంటుందా? లేదా? అనేదానిపై ఓ క్లారిటి రానుందని ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: