టాలీవుడ్ టాప్ హీరోలు అంతా ప్రస్తుతం తాము నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమాలలో బ్రహ్మనందం పాత్రను ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించడానికి కధతో సంబంధం లేకపోయినా ఎంత వీలైతే అంత పెంచమని దర్శకులకు సూచనలు ఇస్తూ బ్రహ్మి కామెడీ ద్వారా అయినా తమ సినిమాలకు హిట్ టాక్ ను తెచ్చుకుందామని నానా పాట్లు పడుతున్నారు. టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా బ్రహ్మికి ఫ్యాన్స్ వున్నారు. ఈ విషయం సూపర్ స్టార్ రజినీకాంత్ దృష్టి దాకా వెళ్ళింది కాబోలు రజినీ స్వయంగా చెప్పి తాను నటిస్తున్న ‘లింగా’ సినిమాలో బ్రాహ్మికి ఒక పాత్ర క్రియేట్ చేయించాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఈ సినిమాలో బ్రహ్మికి సంబంధించిన సన్నివేశాల్ని రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరించినట్లు సమాచారం. అనుష్క, సోనాక్షి సిన్హా, బ్రహ్మీల మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలున్నట్లు టాక్. ఇవేకాకుండా రజినీకాంత్‌తోనూ కొన్ని సన్నివేశాలు బ్రహ్మికి ఉంటాయట. రజినీకాంత్ సినిమాలకు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంటుంది కాబట్టి ఒక ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ ను కూడా ఈ సినిమాకు జత చేస్తే బాగుంటుంది అన్న వ్యూహాత్మక ఎత్తుగడతో బ్రహ్మానందం కోసం ఒకపాత్రను సృష్టించారు అని టాక్. ఇప్పటికే అత్యధిక చిత్రాల్లో నటించిన కమెడియన్‌గా గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్న బ్రహ్మానందం ప్రస్తుతం 997 సినిమాల్లో నటించాడు. అతి త్వరలోనే బ్రహ్మానందం 1000 సినిమాలు పూర్తి చేసుకుని మరో సరికొత్త రికార్డు సృష్టించబోతున్నాడు. అందుచేతనే కాబోలు రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్లు కూడా బ్రహ్మానందం మాయలో పడిపోతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: