సన్నీలియోన్ క్రేజ్ కు సంభందించి వస్తున్న వార్తలు చూస్తూ ఉంటే సన్నీ బాలీవుడ్ లోనే కాదు అన్ని భాషల సినిమాలను షేక్ చేసే కాలం అతి దగ్గరలోనే ఉందా అని అనిపిస్తోంది. ఆమె సినిమాలకు బయ్యర్ల లలో డిమాండ్ విపరీతంగా పెరిగిపోతు ఉండటంతో దాన్నిక్యాష్ చేసుకునేందుకు నిర్మాతలు కూడా తెగ ప్రయత్నిస్తున్నారు.  లేటెస్ట్ గా సన్నీలియోన్ ప్రధాన పాత్రలో శృంగార ప్రధానమైన కథాంశంతో ‘మస్తీజాదె' అనే సినిమాను బాలీవుడ్ లో తీస్తున్నారు. ఈసినిమా చిత్రీకరణ ఇంకా సగం కుడా పూర్తి కాకుండానే ఈసినిమాకు అప్పుడే డిస్ట్రిబ్యూటర్ల నుండి 32 కోట్లకు భారీ ఆఫర్ లు వచ్చినట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఈషూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమా సగం కుడా పూర్తి కాలేదు. ఈ సినిమాను 2015లో విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు అంచనాలు పెంచేయడంతో ఇంత భారీ ఆఫర్లు వస్తున్నాయి అని అంటున్నారు. ఈ 'మస్తీ జాదే' చిత్రానికి మిలాప్ జవేరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్య బాలీవుడ్లో సెక్స్ కామెడీ చిత్రాలకు మంచి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో సెక్సీ స్టార్ సన్నీ లియోన్‌తో ఈ సినిమా ప్లాన్ చేసి నిర్మిస్తున్నారు. సన్నీలియోన్ బాలీవుడ్లో నటిస్తున్న తొలి సెక్స్ కామెడీ సినిమా కావడంతో కేవలం పోస్టర్లు చూసి 32 కోట్లు ఆఫర్లు రావడం బాలీవుడ్ కు షాకింగ్ గా మారింది. అందుకే కాబోలు మన టాలీవుడ్ ను కుడా సన్నీ ఫీవర్ కుదిపేస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: