మొన్న హైదరాబాద్ లో జరిగిన ‘పవర్’ త్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుకకు దర్శకుడు వినాయక్ అతిధిగా వచ్చి ప్రతీ దర్శకుడిలోను మంచి రచయిత ఉంటాడనీ అందువల్లనే దర్శకులుగా మారుతున్న రచయితలు సూపర్ హిట్స్ సాధించగలుగుతున్నారని ఈ సినిమా దర్శకుడు బాబీ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే ఈ వేడుకకు వచ్చిన అతిధులు మాత్రం వినాయక్ ను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేసుకోవడం ఆ వేడుకకు వచ్చిన వారికి నవ్వు తెప్పించింది. ఆ మధ్య రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ ఆడియో వేడుకకు చిరంజీవి ఆప్తులు అంతా వచ్చినా వినాయక్ కనిపించక పోవడంతో చాలామంది వినాయక్ చిరంజీవుల మధ్య చిరు 150వ సినిమాకు సంబంధించి కధ విషయంలో భేదాభిప్రాయాలు రావడంతో అలిగిన వినాయక్ చరణ్ ‘గోవిందుడు’ ఆడియో వేడుకకు రాలేదు అనే ప్రచారానికి తెరతీసారు.  అయితే మెగా కుటుంబ సన్నిహితులు మాత్రం వినాయక్ చిరంజీవి సినిమా కధ విషయంలో బిజీగా ఉండటంతో ‘గోవిందుడు’ ఆడియో వేడుకకు దూరంగా ఉన్నాడు అంటూ సరిపెట్టారు. అయితే ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకే వినాయక్ ‘పవర్’ త్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుకకు రావడమే కాకుండా ఫంక్షన్ అయ్యేంత వరకు తీరికగా కూర్చుని వెళ్ళడంతో వినాయక్ తయారు చేస్తున్న చిరంజీవి 150వ సినిమా స్క్రిప్ట్ అప్పుడే పూర్తి అయిపోయిందా అని సెటైర్లు వేసుకోవడం వినిపించింది. అంతేకాదు వినాయక్ చిరంజీవి సినిమాకు స్క్రిప్ట్ రాస్తున్నాడా లేక అఖిల్ సినిమాకు స్క్రిప్ట్ రాస్తున్నాడా అంటూ మరో అడుగు ముందుకు వేసి వినాయక్ పై సెటైర్లు వేసుకున్నారు అని తెలుస్తోంది. ఏమైనా ‘పవర్’ త్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుకలో వినాయక్ ప్రస్తావనలు హాట్ టాపిక్ గా మారాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: