బాలీవుడ్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ దీపికా పడుకునేకు మద్దతుగా ఏకంగా హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు రంగాగంలోకి దిగడం సంచలనంగా మారింది. స్త్రీ జాతిని గౌరవించండి సాటి మహిళలను అందరితో సమానంగా చూడండి. వారి మనసును గాయ పరచకండి అంటూ హార్వర్డ్‌లోని భారతీయ విద్యార్థులు దీపికకు మద్దతుగా మొదలు పెట్టిన క్యాంపెయిన్ టాక్ అఫ్ ది బాలీవుడ్ గా మారింది.  లేటెస్ట్ గా ఎక్స్‌పోజింగ్ అంశం పై దీపికా పదుకునె ఎదుర్కున్న ఆరోపణలకు సమాధానంగా దీపికకు వత్తాసు పలుకుతూ ఈ క్యాంపెయిన్ లాంచ్ చేశారు. అంతే కాదు ఆడవారి శరీరాన్ని గుడ్లప్పగించే చూసే విష సంస్కృతి అంత మంచిది కాదంటూ కొన్ని నినాదాలు చేయడం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. ఆడవారికి కుడా స్వేచ్ఛ వుంటుందని గుర్తించాలని ఈ క్యాంపెయిన్ సభ్యులు పేర్కొంటున్నారు. ఈ ఉద్యమంలో భాగంగా హార్వర్డ్ విద్యార్థులు ఫోజులిస్తూ వారి భావాలను ప్లకార్డుల ద్వారా వ్యక్తపరిచడం ఇప్పుడు దీపికకు కొండంత అండగా మారింది. అయితే హార్వర్డ్ విద్యార్థుల చైతన్యం కేవలం దీపికకే పరిమితం చేయకుండ భారరతదేశంలో స్త్రీలు ఎదుర్కునే అనేక విషయాలకు కుడా విస్తరింప చేస్తే బాగుటుంది అనే కామెంట్స్ వినపడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: