‘రభస’ ఇచ్చిన నిరాస షాక్ నుండి జూనియర్ తేరుకున్నాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో తన ఆవేశాన్ని చూపెడుతూ కొంతమంది ఫైటర్ల పై విరుచుకు పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది అంతా పూరి జగన్నాథ్ దర్శకత్వoలో జూనియర్ తో తీస్తున్న కొత్త సినిమాకు సంబంధించి యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో జరుగుతున్నసందడి.  నిన్నఈ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో పూరి, జూనియర్ లు బిజీగా ఉన్నట్లు టాక్. ఈ మధ్య పూరీతో జూనియర్ చేస్తున్న సినిమా చేయడంలేదని, స్టోరీ సరిగా లేకపోవడంతో ఆగిపోయిందంటూ గాసిప్స్ జోరందుకున్న విషయం తెలిసిందే. ఈ గాసిప్స్ ను మటుమాయం చేస్తూ ఈ సినిమా మళ్ళీ ప్రారంభం కావడం జూనియర్ అభిమానులకు పండుగగా మారింది అనే వార్తలు వస్తున్నాయి. జూనియర్ కోరుకున్న మార్పులతో ఈ సినిమా షూటింగ్ వేగంగా పూర్తి చేసి సంక్రాంతి రేసులో నిలవాలని జూనియర్ గట్టి పట్టుదలపై ఉన్నాడు అనే వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ అల్యూమినియం ఫ్యాక్టరీలో తీసిన జూనియర్ సినిమాలు అన్ని సూపర్ హిట్ గా మారడం తో అదే సెంటిమెంట్ ను జూనియర్ పూరీలు కొనసాగిస్తునారని యూనిట్ వర్గాల వారి టాక్.  ఈ సెంటిమెంట్ అయినా కలిసివస్తే వచ్చే సంవత్సరం నుండి జూనియర్ దశ తిరుగుతుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: