చిన్నారి పెళ్ళికూతురులా బుల్లితెరను షేక్ చేసిన అవికాగోర్ ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో క్యూట్ హీరోయిన్ గా మారిపోయి తన మొట్టమొదటి సినిమాతోనే టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాధించుకుంది. అయితే ఈ సినిమా హిట్ అయ్యాక ఎన్నో అవకాశాలు వచ్చినా అవేవి ఒప్పుకోకుండా ఒకే ఒక్క సినిమా ఒప్పుకుని అందర్నీ ఆశ్చర్య పరచింది. ప్రస్తుతం అవిక ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ కావడంతో ఈ సినిమాలో నటించడానికి అవికాగోర్ ఒప్పుకుంది అనే టాక్ ఉంది. ‘ఊహాలు గుసగుసలాడే’ సినిమా హీరో నాగశౌర్య ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. చిన్న సినిమాగా  నిర్మింపబడుతున్న ఈ సినిమా బడ్జెట్ 2.50 కోట్ల లోపే అనే వార్తలు ఉన్నాయి. నంద్యాల రవి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిన్న సినిమా అయినా అవికాగోర్ క్రేజ్ తో ఈ సినిమా బిజినెస్ బాగా అయింది అనే వార్తలు వినపడుతున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఒక ప్రముఖ ఛానల్ 2 కోట్లకు కొనుక్కుంది అనే వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమా టైటిల్ కు తగ్గట్టుగా పెట్టిన పెట్టుబడిలో చాల ఎక్కువ భాగం శాటిలైట్ రైట్స్ రూపంలో వచ్చేయడంతో ఈ సినిమా నిర్మాతకు అవికాగోర్ నిజమైన లక్ష్మిదేవిగా మారిపోయింది అనే సెటైర్లు పడుతున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: