ఒక వైపు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమింపబడతాడు అని వార్తలు వస్తు ఉంటే తానేమి తక్కువ కాదు అంటూ సూపర్ స్టార్ కృష్ణ నిన్న నిరూపించుకున్నాడు. నిన్న గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో ‘కాంటినెంటల్ ఇంటర్నేషనల్ కేన్సర్ సెంటర్ ’ ప్రారంభోత్సవ సభలో ఒకే వేదిక పై ముఖ్యమంత్రి కెసిఆర్, సూపర్ స్టార్ కృష్ణ ఉండటం మీడియాకు ఆశక్తి దాయకంగా మారింది. ఈ ప్రారంభోత్సవ సభలో కెసిఆర్ మాట్లాడుతూ సినీ పరిశ్రమకు ప్రోత్సాహాన్ని ఇస్తామని, నాలుగైదు వేల ఎకరాల్లో ఫిల్మ్‌సిటీని గొప్పగా నిర్మిస్తామని చెప్పారు. దాని బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లలో ఒకరిగా ఉండాలని ప్రముఖ సినీ నటుడు కృష్ణనుకోరడం సంచలనంగా మారింది. ఇదే సభలో మాట్లాడిన సూపర్ స్టార్ కృష్ణ ముప్పై ఏళ్లుగా తాను హైదరాబాద్‌లోనే ఉంటున్నానని, ఈ నగరమే తన సొంత ఊరుగా మారిపోయిందనీ కామెంట్ చేసారు. అంతేకాకుండా ఇక్కడ సినీ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతుందని ఆ కాంక్షిస్తూ కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వేగంగా ముందుకు సాగిపోతుందని కెసిఆర్ ను పొగడ్తలతో ముంచెత్తి వేసారు కృష్ణ. అంతేకాదు  ప్రపంచంలోనే పెద్దదిగా నిర్మించదలచిన ఆ ఫిల్మ్‌సిటీకి కేసీఆర్ ఫిల్మ్‌సిటీగా పేరుపెట్టాలని సూచించాడు సూపర్ స్టార్. నిన్నటి పరిణామాలను బట్టి సూపర్ స్టార్ కుటుంబం అటు చంద్రబాబుతో ఇటు కెసిఆర్ తో సత్ సంబంధాలు కొనసాగిస్తోందని మరోసారి రుజువైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: