మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ఆగడు మూవీ బాక్సాపీస్ వద్ద సందడిని కోల్పోతుంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన అగడు మూవీ, రిలీజ్ అయిన మొదటి రోజే బాక్సాపీస్ వద్ద డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో ఆగడు మూవీ హంగామా మూడు రోజుల ముచ్ఛటగా మారింది. ప్రస్తుతం ఆగడు మూవీ హంగామా ప్రేక్షకుల్లో అంతగా లేకపోవడంతో ఇది అప్ కమింగ్ రిలీజ్ మూవీలకు ఫ్లస్ గా మారింది. ప్రస్తుతం గోపిచంద్ నటించిన లౌఖ్యం మూవీ బాక్సాపీస్ వద్ద నిలకడగా ఉంది. ఇదిలా ఉంటే ఆగడు మూవీని నిర్మించిన 14 రీల్స్ సంస్థకి తెగ ఫోన్స్ వస్తున్నాయంట. అలాగే 14 రీల్స్ అధినేత అనీల్ సుంకర ఫోన్ కి సైతం డిస్ట్రిబ్యూటర్స్ నుండి విపరీతమైన కాల్స్ రావడంతో, అనిల్ సుంకర ఏ విధంగా ఈ సమస్య నుండి బయటపడాలో తెలియక, అమెరికా వెళ్ళినట్టుగా టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తన్నాయి. ఇదిలా ఉంటే కొంత మంది ఆగడు మూవీ పంపిణీ దారులు, అనిల్ సుంకర్ ని పర్సనల్ గా కలిసి, ఈ మూవీ వల్ల వారికి కలుగుతున్న ఇబ్బందులని చెప్పుకుంటున్నారంట. మొత్తంగా అనిల్ సుంకర ఆగడు మూవీ ద్వార ఒకటి ఆశిస్తే, ఫలితం మరో రకంగా వచ్చిందని అంటున్నారు. ఈ సమస్యల నుండి గట్టెక్కడానికి పంపిణీ దారులకి కొంత సమయం పడుతుందని వారు చెబుతున్నారు. శ్రీనువైట్ల దర్శకత్వం చేసిన దూకుడు మూవీకి సీక్వెల్ గా ఆగడు మూవీని తెరకెక్కించారు. ఆగడు మూవీకి సంబంధించిన కథనం చాలా పాతదిగా కనిపించడంతో, ప్రేక్షకులు సైతం ఈ మూవీని రిజెక్ట్ చేశారు. మొత్తానికి ఓవర్ కాన్ఫిడెంట్ తో వచ్చిన మహేష్ బాబు, శ్రీనువైట్లకి ఆగడు సక్సెస్ రిపోర్ట్ ఓ గుణపాఠం అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: